అల్లెన్ ఫారెస్ట్ జూ ను కాన్పూర్ జూ అని కూడా అంటారు. ఇది సహజమైన అడవి లో విస్తారంగా వుంటుంది. ఇతర జూ లలో వాలే జంతువులు బోనులలో కాకుండా వాటి సహజ స్థావరాలలో వుంటాయి. దీనిని ఈ ప్రాజెక్ట్ కు రూప కల్పనా చేసిన ఒక బోటనీ శాస్త్రవేత్త సర్ అల్లెన్ పేరుతో స్థాపించారు.
ఈ జూ లో అనేక అరుదైన జంతువులు కూడా చూడవచ్చు. ఒక ఆక్వేరియం మరియు బొటనికల్ గార్డెన్ , అనేక సరస్సులు, అరుదైన వృక్షాలు కూడా కలవు. జంతువులు, పక్షులు మాత్రమే కాక, ఈ జూ ఒక పచ్చని ప్రశాంతమైన విశ్రాంతి ప్రదేశంగా వుంటుంది. ఇది సిటీ సెంటర్ కి రెండు కి.మీ. ల దూరంలో వుంటుంది.
అటవీ విస్తీర్ణంలో ఈ జూ ఆసియ లోనే అతి పెద్దది. చుట్టూ సహజ సరస్సు, పురాతన వృక్షాలు కలిగి వుంటుంది. ప్రసిద్ధి చెందిన ఒక ఫైక్నిక్ స్పాట్ గా అన్ని వయసుల వారు ఆనందించవచ్చు.