Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాన్పూర్ » వాతావరణం

కాన్పూర్ వాతావరణం

అక్టోబర్ నుండి మార్చ్ వరకు కాన్పూర్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఉత్తర భారత దేశం లో ని మిగతా ప్రాంతాల లాగానే వేసవి లో ని కాన్పూర్ లో ని వాతావరణం వేడి గా మరియు పొడిగా ఉంటుంది.

వేసవి

ఎండాకాలం మార్చ్ నుండి మే వరకు కాన్పూర్ లో వేసవి కాలం. ఈ సమయం లో ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వేడి గాలుల తో వాతావరణం పొడి గా ఉంటుంది. 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. అడపా దడపా కురిసే భారీ వర్షపాతాల వల్ల ఇక్కడ వాతావరణం తడిగా, తేమగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ శీతాకాలం. వాతావరణం ఆహ్లాదం గా ఉంటుంది. 12°C నుండి 20°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జనవరి లో మంచు కురుస్తుంది. అందువల్ల విమానాలు రద్దవడం, రైళ్లు అలస్యమవటం వంటి సంఘటనలు జరుగుతాయి.