గువహతి - సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం !

ఈశాన్య ప్రాంతం వరకు విస్తరించబడిన నగరం గువహతి అస్సాంలోని పెద్ద నగరం . బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న మంత్రముగ్ధమయిన గువహతి నగరం రాష్ట్రం తో పాటు ఈ ప్రాంతం యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబించే నగరం. సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం ఈ నగరం. వివిధ మతాలకు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు గువహతి లో దశాబ్దాల తరబడి నివసిస్తున్నారు.

ఘనమైన చరిత్ర కలిగిన నగరం

'తూర్పు వెలుతురూ' అనే అర్ధం వచ్చే 'ప్రగ్జ్యోతిష్పూర్' అని ఇదివరకు గువహతిని పిలిచేవారు.చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ నగరం గురించి మహాభారతం లో రాక్షసరాజు అయిన నరకాసుర యొక్క రాజధాని గా ప్రస్తావించబడినది.  అస్సాం ని ఎన్నో సార్లు ఆక్రమించాలని ప్రయత్నించిన మొఘలులు ప్రతి సారి ఓటమి పాలు అయ్యేవారు.

గువహతి పర్యాటకం

గువహతి లో ని పర్యాటక పరంగా చాలా విశేషాలు ఉన్నాయి. కామాఖ్య టెంపుల్ ని సందర్శించకుండా గువహతి సందర్శన అసంపూర్ణం. బ్రహ్మపుత్రా నది ఒడ్డు నుండి కనపడే అద్భుతమైన సరయాఘాట్ బ్రిడ్జి పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది. అస్సాం స్టేట్ మ్యూజియం, గువహతి ప్లానెటోరియం మరియు వివిధ ఆలయాలు ఈ నగరం లో పర్యాటక ఆకర్షణలు.

ఘనమైన నగరం

ఈశాన్య ప్రాంతం యొక్క ప్రధాన కేంద్రం అయిన గువహతి వాణిజ్యపరంగా బలమైన నగరం. అతిపెద్ద రైల్వే స్టేషన్ నుండి ఈ ప్రాంతం లో ఉన్న ఏకైక విమానాశ్రయం వరకు ఈ నగరం లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. మేఘాలయ వంటి ఇతర రాష్ట్రాలకి గువహతి కనెక్టింగ్ నగరం గా వ్యవహరిస్తుంది. విద్యాపరమైన అంశాలలో కూడా గువహతి ప్రత్యేక స్థానాన్ని పొందింది.   గువహతి లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఉన్న కారణంగా ఇండియన్ ఎడ్యుకేషనల్ మ్యాప్ లో ఈ ప్రాంతం గురించి  గమనించవచ్చు. ఇటివలే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు ఈ నగరం లో నే తమ ఈశాన్య శాఖని ప్రారంభించారు. అంతర్జాతీయ స్కూళ్ళు ఇంకా పేరొందిన కళాశాలలు ఈ రాష్ట్రానికే వన్నె తెస్తున్నాయి. సాంస్కృతిక పరంగా కూడా ఈ నగరం పేరు మార్మోగుతుంది. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర అనేది ఈ నగరం యొక్క సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ బిహు అనే పండుగతో పాటు ఇతర పండుగలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

గువహతి కి చేరే మార్గం

దేశం లో ని మిగతా ప్రాంతాలకు గువహతి చక్కగా అనుసంధానం అయి ఉంది. ఈశాన్య ప్రాంతం లో అతిపెద్ద రైల్వే స్టేషన్ గువహతి లో ఉంది. అంతే కాక లోకప్రియ గోపీనాథ్ బోర్దోలోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఉంది. రోడ్డు మార్గం ద్వారా కూడా గువహతి దేశం లోని ఇతర ప్రాంతాలకు చక్కగా అనుసంధానమై ఉంది.

గువహతి వాతావరణం

గువహతి లో ని వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఇక్కడ 30 డిగ్రీల సెల్సియస్ నుండి 19 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక్కడ ఎండాకాలం, వర్షాకాలం ఇంకా శీతాకాలం లు ఈ నగరాన్ని సందర్శిస్తాయి.

Please Wait while comments are loading...