Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సిల్చార్

సిల్చార్  - బరాక్ నది తో అనుబంధం !

15

కాచార్ జిల్లా డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ అయిన సిల్చార్ దక్షిణ అస్సాం లో ఉంది. చిన్న పట్టణమైనా అందమైన పట్టణం. ఈ నగరం చుట్టూ అందమైన బరాక్ నది ఈ నగరం యొక్క అందాన్ని రెట్టింపు చేస్తుంది. బరాక్ నది ఈ ప్రాంతం లో ప్రవహిస్తుంది కాబట్టి సిల్చార్ మరియు సిల్చార్ ని అనుకుని ఉన్న పట్టణాలను గ్రామాలను బరాక్ లోయ గా పిలుస్తారు.

మణిపూర్ మరియు మిజోరాం రాష్ట్రాలని దేశం లో ని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసే ప్రాంతం లో సిల్చార్ నగరం ఉంది. అందువల్ల ఇది ఆర్ధికంగా బలమైన నగరం. వీటితో పాటు, ఇక్కడున్న టీ గార్డెన్స్ వల్ల ఈ నగరం ఆర్ధికంగా అభివృద్ధి చెందింది. బియ్యం, టీ మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్ గా కూడా ఈ నగరం వ్యవహరిస్తుంది.

సిల్చార్ పర్యటన - సిల్చార్ లో ఇంకా చుట్టూ పక్కల పర్యాటక ప్రదేశాలు

సిల్చార్ లో పర్యాటకులు సందర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ నగరం యొక్క సామాన్యమైన రూపం ఏంతో మందిని నిరాశ పరిచినా ఇక్కడున్న దేవాలయాలు ఇంకా ఇతర ఆకర్షణలు ఈ నగరానికి అందాన్ని తీసుకువస్తాయి. కాంచా కాంతి దేవి ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. నగరం నడి బొడ్డు నుండి 17 కిలోమీటర్ల దూరం లో ఉన్నా స్థానికులు ఇంకా పర్యాటకులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తారు. భుబాన్ మహాదేవ టెంపుల్ మర్టిర్స్ టూమ్బ్ మరియు ఖస్పూర్ లు మరికొన్ని ఆకర్షణలు.

ఎలా చేరాలి

వాయు మార్గం, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా సిల్చార్ కి సులభంగా చేరుకోవచ్చు. దక్షిణ అస్సాం ని దేశం లో ని ఇతర ప్రాంతాలతో జాతీయ రహదారులు చక్కగా అనుసంధానం చేస్తాయి. అయితే, సిల్చార్ ని గువహతి కి అనుసంధానం చేసే జాతీయ రహదారి 44సరైన స్థితి లో లేదు. ఇక్కడి విమానాశ్రయం లో గువహతి నుండి కోల్కతా కి అనుసంధానం చేసే సర్వీసులు ప్రతి రోజు ఉన్నాయి.

సిల్చార్ వాతావరణం

సిల్చార్ లో ని వాతావరణం ఆహ్లాదకరం గా ఉంటుంది. తేమతో కూడిన ఎండాకాలం, గణనీయమైన వర్షపాతం నమోదాయ్యే వర్షాకాలం ఇంకా ఆహ్లాదకరమైన శీతాకాలం తో సిల్చార్ వాతావరణం పర్యాటకులని పలకరిస్తుంది.

సిల్చార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సిల్చార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సిల్చార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సిల్చార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం జాతీయ రహదారి 44 సిల్చార్-షిల్లాంగ్ -గువహతి ల ని అనుసంధానం చేస్తుంది. ఈ నగరానికి రోడ్డు మార్గం ముఖ్యమైనది. అయినప్పటికీ, వర్షాకాలం లో రోడ్లు సరిగా ఉండకపోవడం వల్ల ఈ మార్గాన పర్యటించడం ప్రమాదకరం. ప్రతి రోజు మరియు రాత్రి గువహతి నుండి షిల్లాంగ్ ద్వారా సిల్చార్ కి బస్సు వసతి వెళ్లి రావడానికి ఉన్నది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం సిల్చార్ నుండి మీటర్ గేజ్ రైల్వే లైన్ లుమ్బ్దింగ్ కి ఉన్నది. బ్రాడ్ గేజ్ లైన్ ఇంకా నిర్మాణం లో నే ఉంది. సిల్చార్ ని రైలు మార్గం ద్వారా రావాలనుకునే పర్యాటకులు బ్రాడ్ గేజ్ ట్రైన్ లో లుమ్డింగ్ వరకు వచ్చి అక్కడ మీటర్ గేజ్ ట్రైన్ లో సిల్చార్ కి చేరుకోవాలి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం నగరం నుండి 22 కిలోమీటర్ల దూరం లో కుంభీర్ గ్రామ్ లో ఈ సిల్చార్ విమానాశ్రయం ఉంది. గువహతి మరియు కోల్కతా లకు చేరుకునేందుకు సిల్చార్ నుండి రోజువారి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం బ్రటిష్ వారి పాలనలో నిర్మితమయింది. ఆ తరువాత భారత ప్రభుత్వం వారు దీనిని అభివృద్ధి చేసారు. ఈ విమానాశ్రయం నుండి నగరానికి చేరుకునేందుకు టాక్సీలు లభ్యమవుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun