కొహిమ - కెవి పూవుల భూమి

ఈశాన్య భారత దేశం లో కల నాగాలాండ్ నగరం లోని కొహిమ ఎంతో సుందర ప్రదేశం. ఎన్నో తరాలుగా ఈ ప్రదేశం దాని ప్రకృతి అండ చందాలతో పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఒకప్పుడు ఇక్కడ అంగామీ తెగ ప్రజలు నివసించేవారు. కాని ఇపుడు నాగా ల్యాండ్ లోని అన్ని ప్రాంతాల వారు నివసిస్తున్నారు. ఇక్కడ దొరికే కేవీమ లేదా కేవేర పూవులా కారణంగా ఈ ప్రాంతానికి కేవ్హిమా అనే పేరు వుండేది. కాని బ్రిటిష్ వారు దానిని వారి ఆంగ్లం లో కొహిమా అని అనువదించారు.

కొహిమా నాగాలాండ్ కు రాజధాని.

నాగా జాతి ప్రజల ఇతర ప్రాంతాల వలెనె ఈ ప్రాంతం కూడా చాలా కాలం చరిత్ర కు రాలేదు. ఇక్కడి కొండ తెగల ప్రజలతో బ్రిటిష్ వారు సుమారు నాలుగు దశాబ్దాలపాటు పోరాటాలు చేసి కొహిమా లో వారి పాలనా కార్యాలయం పెట్టి, నాగ హిల్స్ జిల్లాను అస్సాం లో భాగంగా ఏర్పరిచారు. దాని తర్వాత డిసెంబర్ 1 వ తేది, 1963 లో భారత ప్రభుత్వం కొహిమా రాష్ట్ర రాజధానిగా , నాగాలాండ్ ను దేశంలో 16వ రాష్ట్రంగా ఏర్పరిచింది.

రెండవ ప్రపంచ యుద్దం లో కొహిమా ప్రాంతం కొహిమా యుద్ధం పేరుతో ఎంతో ప్రముఖ పాత్ర వహించింది. ఆ సమయంలో అనేక మంది సైనికులు ఇక్కడ మరణించారు. ఇప్పటికి వారి జ్ఞాపకార్ధం కల స్మశానాలు పర్యాటకులకు ఒక ఆకర్షణ గా నిలుస్తాయి.

కొహిమా సుందర ప్రదేశాలు

కొహిమా పట్టణం పర్యాటకులకు ఎన్నో ఆకర్షణలు అందిస్తుంది. మొనదేలిన కొండ శిఖరాలు, పారాడే మేఘాలు, మంచు గాలులు ఈ ప్రాంతాన్ని టూరిస్టులకు ఒక పర్యాటక ప్రదేశంగా చేసాయి. స్టేట్ మ్యూజియం, కొహిమా జూ, జాఫు శిఖరం వంటివి ప్రపంచం లోనే పేరు గాంచాయి. దేజుకు వాలీ, జుల్కీ ప్రవాహం వంటివి కూడా తప్పక చూడాలి. కొహిమలోని కేథలిక్ చర్చి దేశంలోని అందమైన చర్చిలలో ఒకటి.

సంస్కృతి, ఆహారం, అలవాట్లు

నాగాలాండ్ ప్రజలు వారి ఆతిధ్యానికి పేరు గాంచారు. స్థానిక ఆహారాలు రుచిగా వుండి మరువలేనివిగా వుంటాయి. నాగాలు మాంసం, చేపలు ఇంకా నోరు ఊరే ఇతర వంటకాలు చేస్తారు. వీరి సంస్కృతి విభిన్నంగా వుంటుంది. నాగాలాండ్ లోని ప్రతి తెగకు ఒక రకమైన దుస్త్యులు కలవు. వీరు రంగుల రంగుల బల్లెములు, రంగు వేసిన మేక వెంట్రుకలు, పక్షుల ఈకలు, ఏనుగు దంతాలు అలంకరనలుగా వాడతారు.

టూరిస్టులకు అనుమతి

కొహిమ రక్షిత ప్రాంత చట్టాల పరిధి లోకి వస్తుంది. కనుక, కొహిమ ప్రవేశించాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ పొందాలి. విదేశీయులకు ఈ పర్మిట్ అవసరం లేదు. అయితే వీరు విదేశీయులు గా నమోదు చేసుకోవాలి.

ఈ అనుమతులను డిప్యూటీ రెసిడెంట్ కమిషనర్, నాగాలాండ్ హౌస్, న్యూ ఢిల్లీ, డిప్యూటీ రెసిడెంట్ కమిషనర్, నాగాలాండ్ హౌస్, కొలకత్తా , అసిస్టెంట్ రెసిడెంట్ కమీషనర్ , గౌహతి అండ్ షిల్లాంగ్, డిప్యూటీ కమిషనర్ దీమాపూర్, కొహిమా మరియు మోకక్చంగ్ అధికారులనుండి పొందవచ్చు.

వాతావరణం

కొహిమా లో ఉప ఉష్ణమండల వాతావరణం వుంది సంవత్సరం లో చాలా భాగం ఆహ్లాదకరంగా వుంటుంది.

Please Wait while comments are loading...