Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ట్యూన్సంగ్

ట్యూన్సంగ్ – ఒకేచోట అనేక గిరిజన వర్ణాలు!

6

నాగాలాండ్ లోని తూర్పు చివర అదే పేరుతో వున్న జిల్లాకు ప్రధాన కేంద్రంగా వుంది ట్యూన్సాంగ్. కేవలం తన పరిమాణం వల్లనే కాక ప్రత్యెక రాజ్యాంగపరమైన నిబంధనల వల్ల కూడా ఇది చాలా ముఖ్యమైన జిల్లా. ఒకప్పటి ఈశాన్య సరిహద్దు ప్రాంతాన్ని పరిపాలించేందుకు ట్యూన్సంగ్ నగరాన్ని 1947 లో ఏర్పాటు చేసారు. ఈ జిల్లాకు తూర్పున మయన్మార్, ఇతర దిక్కులలో నాగాలాండ్ లోని ఇతర జిల్లాలు సరిహద్దుగా వున్నాయి. ఈశాన్య సరిహద్దు ప్రాంతానికి పరిపాలనా కేంద్రంగా వున్నప్పుడు ట్యూన్సాంగ్ లో ఇప్పటి మోన్, కిఫైర్, లాంగ్లేంగ్ జిల్లాలు కూడా ఉండేవి. ఈ నాలుగు జిల్లాలను కలిపి తూర్పు నాగాలాండ్ గా పిలిచేవారు.

1957 దాకా ట్యూన్సాంగ్ ఇటు భారతదేశంలో గానీ అటు మయన్మార్ లో గానీ చేరలేదు, కానీ అవిభక్త అస్సాం లోని కొహిమా, మొకొక్ చుంగ్ జిల్లాలను ట్యూన్సాంగ్ తో కలిపాక దాన్ని భారత భూభాగంలో ఒక ప్రదేశంగా అధికారికంగా గుర్తించారు. ఈ కాలంలో (నాగాలాండ్ ఏర్పడక ముందు) ట్యూన్సాంగ్ నాగా కొండల ట్యూన్సాంగ్ ప్రాంతానికి పరిపాలనా కేంద్రం. తరువాత 1963 లో ట్యూన్సాంగ్, మొకొక్ చుంగ్, కొహిమా జిల్లాలతో నాగాలాండ్ ఏర్పడింది. మరిన్ని జిల్లాలు ఏర్పడేసరికి ట్యూన్సాంగ్ జిల్లా పరిమాణం తగ్గిపోయింది.

ట్యూన్సాంగ్ సముద్ర మట్టానికి 1371 అడుగుల ఎత్తులో – వోఖా, మొకొక్ చుంగ్ గుండా ప్రయాణిస్తే కొహిమా నుంచి 269 కిలోమీటర్ల దూరంలో వుంది – అలాగే జున్హే బోతో గుండా వెళ్తే రాష్ట్ర రాజధానికి 235 కిలోమీటర్ల దూరంలో వుంది. ట్యూన్సాంగ్ తూర్పు నాగాలాండ్ కు ప్రధాన కేంద్రం గా వుంది – పైగా భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రత్యెక నిబంధనల ప్రకారం పార్లమెంటు చేసే ఎలాంటి చట్టాలు నాగాలా ధార్మిక సామాజిక ఆచారాల మీద ప్రభావం కలిగి వుండవు, అలాగే భూమి బదలాయి౦పులు కూడా ట్యూన్సాంగ్ లో ఎలాంటి ప్రభావం కలిగి వుండవు. అయితే, నాగాలాండ్ విధాన సభ వీటిపై చట్టం చేస్తే అవి చెల్లుతాయి.

సంస్కృతీ రంగుల కాంతితో అసాధారణ పర్యాటక ప్రదేశం

అనేక తెగలు ఈ స్థలంలో తమ గొప్ప సంస్కృతిక రుచిని జోడించి సహజీవనం సాగిస్తుండడం వల్ల ఈ ట్యూన్సంగ్ ని చిన్న-నాగాలాండ్ అనికూడా పిలుస్తారు. ఉత్సాహవంతులైన ప్రజలు, సంప్రదాయాలు, ఆచారాలు, రంగుల అలంకారాలు, అనేక నృత్యాలు, జానపద గీతాలతో ట్యూన్సంగ్ అసాధారణ ప్రదేశంగా తయారైంది. నాగాలాండ్ గురించి శీఘ్రంగా తెలుసుకోవడానికి, పర్యాటక నిపుణులు తప్పక ఈ ప్రదేశాన్ని సందర్శించాలని భావిస్తారు. నాగాలాండ్ లోని ఇతర జిల్లాల లాగా కాకుండా, ట్యూన్సంగ్ లో కొన్నిడ్ తరాలుగా సహజీవనాన్ని కొనసాగించిన అనేక తెగలు ఈ ప్రాంత౦లో బలమైన జాతి వైవిధ్యం మరింత పెరిగింది. చాంగ్ లు, సంగ్టం లు, యిమ్చుంగర్ లు, ఖై౦ నిఉంగాన్ లు, ట్యూన్సంగ్ శాశ్వత భూ యజమానులు లేదా శాశ్వత గిరిజనులు. ఈ తెగలే కాకుండా, సుమీ నాగాలు కూడా ఈ పట్టణంలో ఒక భాగం.

ప్రత్యెక హస్త కళాకృతులు, చేనేత & ఆభరణాలు – పర్యాటకులు ఇష్టపడేవి

ట్యూన్సంగ్ హస్త కళాకృతులు అదేవిధ౦గా చేనేత వస్త్రాలకు కూడా ప్రసిద్ది గాంచింది. ఇక్కడి ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఫాషన్ ను ఇష్టపడే సాంప్రదాయ నాగా దుస్తులను ధరించడం చూడవచ్చు. ఎక్కువ ఎరుపు రంగును, కష్టమైన కళా పనిని, అద్భుతమైన ఆభరణాలను ఈ ట్యూన్సంగ్ మార్కెట్ లో చూడవచ్చు. వీరు వేటకు బైటికి వెళ్ళడం చాలా అరుదు, ట్యూన్సంగ్ పర్యటనలో ఎక్కువ సంతృప్తిని ఇచ్చేది ప్రత్యేకంగా గిరిజన చేతి కళాకృతులు అని చెప్పవచ్చు. పర్యాటకులు ట్యూన్సంగ్ పట్టణం నుండి ఈ జిల్లాలోని లాంగ్ త్రొక్, కిఫిరే, పున్గ్రో వంటి అనేక ఇతర ప్రదేశాలకు కూడా పర్యటించవచ్చు.

 వాతావరణ౦

ఏడాది పొడవునా ట్యూన్సంగ్ లో వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

 

ట్యూన్సంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ట్యూన్సంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ట్యూన్సంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ట్యూన్సంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా ట్యూన్సంగ్ నుండి దిమాపూర్ ను కలుపుతూపోయే 155 జాతీయ రహదారి ఈ పట్టణానికి జీవం లాంటిది. ఈ జాతీయ రహదారి గుండా అన్ని టాక్సీలు, బస్సులు ట్యూన్సంగ్ కు చేరతాయి. మీరు దిమాపూర్ చేరుకొని, రోడ్డు పై ట్యూన్సంగ్ నుండి ముందుకు వెళ్ళవచ్చు. అదేవిధ౦గా, మరియని లేదా అమ్గురి చేరుకున్న తరువాత కూడా మీరు రోడ్డుమార్గం ద్వారా ట్యూన్సంగ్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్గురి రైల్వే స్టేషన్ ట్యూన్సంగ్ కి సమీప రైల్వే స్టేషన్. మరిఅని రైల్వే స్టేషన్ కూడా దగ్గరే. మీరు రైల్లో దిమాపూర్ చేరుకోవచ్చు, తరువాత 600 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణంతో ట్యూన్సంగ్ చేరవచ్చు. ఈ స్టేషన్ నుండి పర్యాటకులకు టాక్సీలు, రాష్ట్ర రావాణా బస్సులు తేలికగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ట్యూన్సంగ్ కి దిమాపూర్ సమీప విమానాశ్రయం. దిమాపూర్ నుండి, ఇతర రవాణా సౌకర్యాలు కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి. ట్యూన్సంగ్ కి 113 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోర్హాట్, 183 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం లఖింపూర్ జిల్లాలోని లిలాబరి, 183 కిలోమీటర్ల దూరంలోని డిబ్రుఘర్ ఇతర సమీప విమానాశ్రయాలు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat