వోఖ – లోథాల భూమి!

హోమ్ » ప్రదేశములు » వోఖ » అవలోకనం

వోఖ, రాష్ట్రంలో దక్షిణ భాగంలో ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం, పట్టణం. ఇది నాగాలాండ్ అతి పెద్ద తెగ లోథాలకు నివాస ప్రాంతం. వారి చరిత్రలో చాల భాగంలో ఈ ప్రాంతం నాగాలాండ్ లోని ఇతర ప్రాంతాలలాగే బయటి ప్రపంచానికి దూరంగా ఉంది. కేవలం 1876 సంవత్సరంలో మాత్రమే బ్రిటిష్ వారు ఇక్కడకి వచ్చి అస్సాంలో నాగా కొండల జిల్లాకు దీనిని ప్రధాన కేంద్రంగా మార్చారు. దీని చుట్టూ ఉన్న చాల కొండలు, పర్వత పంక్తులు ఈ ప్రాంతాన్ని సుందరమయం చేసి పర్యాటకానికి అనువుగా మార్చాయి. దీనికి ఉత్తరాన మోకోక్చుంగ్ జిల్లా, తూర్పున జున్హేబోటో, పశ్చిమాన అస్సాం ఉన్నాయి.

వోఖలో పర్యాటక౦

లోథా గిరిజనులు ఎంతో చక్కగా, చేతులు చాచి పర్యాటకులను వోఖలోనికి స్వాగతిస్తారు. ఈ ప్రాంతంలోని ప్రధాన పండగలు తోఖు, పిఖుచక్, ఎమంగ్ ల సమయంలో మీరు ఈ ప్రాంతంలోని స్థానిక నృత్యం, సంగీతాలలో ఉత్తమమైనవి చూడగలరు. తరతరాలుగా ఒక పద్ధతి ప్రకారం చేతితో తయారు చేసిన శాలువాలకు ఈ పట్టణం ప్రసిద్ధి. వోఖ ఆశీర్వదించబడిన అనేక పర్యాటక ఆకర్షణలలో మౌంట్ టియి, టోత్సు కొండచరియలు, డోయంగ్ నది వంటివి ఉన్నాయి.

భారత పౌరులు నాగాలాండ్ రాష్ట్రంలోనికి ప్రవేశించడానికి అంతర్గత మార్గ అనుమతి తీసుకొనవలసి ఉంటుందనేది గుర్తుంచుకొనవలసిన ముఖ్యమైన విషయం. న్యూ ఢిల్లీ, కోల్కత, గువహతి లేదా షిల్లాంగ్ లలోని నాగాలాండ్ హౌస్ నుండి పొందగలిగిన ఇది ఒక సాధారణ ప్రయాణ పత్రం. పర్యాటకులు ఈ అనుమతిని దిమాపూర్, కొహిమ, మోకోక్చుంగ్ డిప్యూటీ కమీషనర్ లకు దరఖాస్తు చేసి కూడా పొందవచ్చు.

 వాతావరణం

వోఖ పర్వత ప్రాంతమైనందున ఏడాది పొడవునా అతి చల్లని శీతాకాలంతో కూడిన ఉష్ణమండలీయ వాతావరణాన్ని కల్గి ఉంటుంది.

Please Wait while comments are loading...