జిరో   - అధిక అందం కలిగిన ప్రకృతికి పయనం !

జిరో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన పట్టణాల్లో ఒకటి. జిరో అనేది చుట్టూ వరి పొలాలు మరియు అందమైన పైన్ చెట్ల సమూహం మధ్య ఉన్న ఒక చిన్న అందమైన పర్వత ప్రాంత వేసవి విడిది. ఈ పెద్ద అటవీ ప్రాంతం గిరిజన ప్రజలకు నిలయంగా ఉంది. ఈ చిన్న అందమైన పట్టణం సముద్ర మట్టం నుండి 1500m ఎత్తులో ఉంది. గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలం మరియు దాని జీవవైవిధ్యం స్వభావం కారణంగా ప్రకృతి ప్రేమికులకు ఒక ఆదర్శవంతమైన కేంద్రంగా ఉంటుంది.

ఇక్కడ అపతాని తెగ వారు ప్రకృతి దేవుడిని ఆరాధిస్తారు. వారు తేమ భూమి సాగు తో పాటు హస్తకళలు, చేనేత ఉత్పత్తులను చేయడము ద్వారా వారి జీవనానికి డబ్బులు సంపాదిస్తారు. అపతాని గిరిజన ప్రజలు మరియు ఇతర తెగలు దేశ దిమ్మరులు కాదు. జిరో ప్రాంతం లో శాశ్వత నివాసితులుగా ఉంటారు.

జిరోలో మరియు చుట్టూ పర్యాటక ప్రదేశాలు

జిరోలో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా ఆకుపచ్చ నిర్మలమైన టాలీ లోయ,జిరో పుటూ చిన్నకొండ, తారిన్ చేప ఫామ్,కర్దో వద్ద శివ లింగరూపంలో ఉన్న పొడవైన విగ్రహం ఉన్నాయి. ఆపతాని ప్రజలు మార్చిలో మ్యోకో పండుగ, జనవరిలో మురుంగ్ పండుగ మరియు జూలై లో డ్రీ పండుగలను జరుపుకుంటారు.

జిరో వాతావరణము

జిరో యొక్క వాతావరణం ప్రతి సీజన్ కు మారుతూ ఉంటుంది. పర్యాటకులను ఏడాది పొడవునా జిరో ను సందర్శించవచ్చు. వాతావరణం భూభాగం మరియు ఈ స్థానంలో నగరం మీద ఆధారపడి ఉంటుంది. అక్టోబర్ మరియు నవంబర్ నెలలు పరివర్తన కాలాలుగా చెప్పవచ్చు. అయితే సంవత్సరంలో శీతాకాలం మినహా,మిగతా కాలమంతా సాపేక్ష ఆర్ద్రత అధికంగా ఉంటుంది.

Please Wait while comments are loading...