Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జోర్హాట్

జోర్హాట్ – పుష్కలంగా తేయాకు తోటలున్న నగరం !!

35

అస్సాం లోని ముఖ్యమైన నగరాల్లో ఒకటైన జోర్హాట్ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో దాని నైసర్గిక స్థితి వల్ల ఎగువ అస్సాం కు, నాగాలాండ్ రాష్ట్రానికి ముఖద్వారం గా పనిచేస్తుంది. జోర్హాట్ అనేది రెండు అని అర్ధం వచ్చే ‘జోర్’ అనే పదం నుంచి, బజార్ అని అర్ధం వచ్చే ‘హాట్’ అనే రెండు పదాల నుంచి వచ్చాయి. జోర్హాట్ ఫోటోలు : హోలోంగాపార్ గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యం – ప్రశాంతతను ఇచ్చే పచ్చదనం చిత్ర మూలం : commons.wikimedia.org.

18 వ శతాబ్దంలో ఇక్కడి భాగ్ దోయి నదికి రెండు వైపులా చౌకి హాట్, మచ్చర్ హాట్ అనే రెండు ప్రసిద్ధ సంతలు జరిగేవి. జోర్హాట్ కు అహోం రాజుల చివరి రాజధానిగా వెలుగొందిన ఖ్యాతి కూడా వుంది. అందువల్ల అహోం రాజ్యపు కాలం నాటి చాలా చారిత్రిక అవశేషాలు కూడా ఇక్కడ వున్నాయి.

జోర్హాట్ పర్యాటకం – అలరించే తేయాకు తోటలు

జోర్హాట్ తేయాకు తోటలకు ప్రసిద్ది. నిజానికి జోర్హాట్ చుట్టుపక్కల దాదాపు 135 తేయాకు తోటలు వున్నాయి. ఈ తోటలు జోర్హాట్ ను అతి పెద్ద తేయాకు ఉత్పత్తి చేసే నగరంగా ప్రసిద్ది చెందడమే కాకుండా జోర్హాట్ చరిత్రలో కూడా తేయాకు తోటలు ప్రధాన భాగం అయిపోయాయి.

సిన్నమోరా తేయాకు తోట లాంటి కొన్ని తోటలను చూడకుండా జోర్హాట్ పర్యటన అసంపూర్ణమే. ప్రపంచం లోని అతి ప్రాచీన తేయాకు పరిశోధన సంస్థ తోక్లాయి టీ పరిశోధనా కేంద్రం ఇక్కడ వుండడం వల్ల జోర్హాట్ అందం ఇనుమడిస్తోంది.

జోర్హాట్ లోను, చుట్టు పక్కలా పర్యాటక కేంద్రాలు

ఇక్కడి అసంఖ్యాకమైన మైదాంల (సమాధులు) గురించి చెప్పకుండా జోర్హాట్ పర్యటన పూర్తికాదు. రాజా మైదాం, లచిత్ బోర్పుఖాన్ మైదాంల సందర్శన జోర్హాట్ సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలియ చేస్తుంది.

పుఖురిలు లేదా చెరువులు నగరం అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. జోర్హాట్ చుట్టు పక్కల వున్న కున్వారి పుఖురి, బదులి పుఖురి లాంటి కొన్ని పుఖురి లను తప్పక చూడాలి.

జోర్హాట్ – అస్సా౦ సాంస్కృతిక రాజధాని

జోర్హాట్ ఘనమైన సంస్కృతి వుంది. ఈ చిన్న నగరం సంగీత, సాహిత్య రూపాల్లో అహోం సంస్కృతిని పరిరక్షించుకుంటోంది. అహోం పాలనను పరిరక్షించడమే కాక దానికి ఆధునికతను కూడా జోడించింది. అహోం రాజుల చివరి రాజధాని అయినప్పటికీ, బ్రిటిష్ వ్యతిరేక సంగ్రామంలో అస్సాంలో ఈ నగరం కీలక పాత్ర పోషించింది. ఎన్నో ఏళ్ళుగా జోర్హాట్ మంచి సంగీత కారులను, రచయితలను, చరిత్ర కారులను అందించి తన సాంస్కృతిక వైభవాన్ని చాటుకుంది.

జోర్హాట్ ఫోటోలు – లచిత్ బోర్పుఖాన్ మైదాం – ఎర్ర భవంతి

అస్సాం నుంచి తొలి జ్ఞానపీఠ అవార్డు పొందిన బీరేంద్ర కుమార్ భట్టాచార్య జోర్హాట్ కు చెందినవాడే. విద్యా రంగ నిపుణుడు కృష్ణ కాంత హాండిక్ కూడా జోర్హాట్ కు చెందినవాడే.

జోర్హాట్ ఎలా చేరుకోవాలి ?

జోర్హాట్ అస్సాం లోని ఇతర నగరాలకు జాతీయ రహదారుల ద్వారాను, పూర్తీ స్థాయి విమానాశ్రయం, రైల్వే స్టేషన్ తోనూ అనుసంధానం చేయబడింది.

జోర్హాట్ వాతావరణం

జోర్హాట్ లో ఉప వర్షాకాల వాతావరణం వుంటుంది, వేసవి లో ఎక్కువ తేమ, వానాకాలంలో ధారాళమైన వర్షాలు పడతాయి.

జోర్హాట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జోర్హాట్ వాతావరణం

జోర్హాట్
25oC / 77oF
 • Patchy rain possible
 • Wind: NNE 8 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం జోర్హాట్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? జోర్హాట్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వారా 37 వ జాతీయ రహదారి జోర్హాట్ ను అస్సాంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. జోర్హాట్ లో రోడ్డు రవాణా బాగుంది, దిబ్రుగర్హ, గౌహతి, అస్సాం లోని ఇతర పట్టణాలకు రోజువారీ బస్సులు తరచుగా అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారిని విస్తరింప చేయడం వల్ల రోడ్డు మార్గం అభివృద్ది చెందింది. ఈ మార్గంలో రాత్రి బస్సులు చాలా సాధారణంగా ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుద్వారా జోర్హాట్ లో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సిటీ సెంటర్ నుండి షుమారు 18.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరియని జంక్షన్ ఈ నగరానికి లైఫ్ లైన్. దిబ్రుగర్హ వెళ్ళే చాలా రైళ్ళు మరియని జంక్షన్ ను తాకుతాయి. ప్రతిరోజూ గౌహతి నుండి రెండు రైళ్ళు నడిచే సిటీ సెంటర్ వద్ద ఉన్న మరో రైల్వే స్టేషన్.జోర్హాట్ లోని రైల్వే స్టేషన్లు జోర్హాట్ పట్టణం
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా రోరియా అని కూడా పిలువబడే జోర్హాట్ అస్సాం లోని ముఖ్యమైన విమానాశ్రయాలలో ఒకటి. ఇది గౌహతి, దేశంలోని ఇతర ప్రదేశాలకు అనుసంధానించబడి ఉంది. అయితే, ప్రస్తుతం ఇక్కడ జెట్ ఎయిర్ వేస్ వారి సేవలే అందుబాటులో వున్నాయి – దీని అనుబంధ సంస్థ అయిన జెట్ కనెక్ట్ జోర్హాట్ నుంచి, జోర్హాట్ కు మధ్య విమానాలు నిత్యం నడుపుతోంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Sep,Sat
Return On
22 Sep,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Sep,Sat
Check Out
22 Sep,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Sep,Sat
Return On
22 Sep,Sun
 • Today
  Jorhat
  25 OC
  77 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Tomorrow
  Jorhat
  22 OC
  72 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Day After
  Jorhat
  23 OC
  73 OF
  UV Index: 6
  Patchy rain possible