Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోర్హాట్ » వాతావరణం

జోర్హాట్ వాతావరణం

జోర్హాట్ వాతావరణం వర్షాకాలం సద్దుమణిగాక మంచు తగ్గిపోయి, ఉష్ణోగ్రత చాలా ఆహ్లాదకరంగా ఉండే శీతాకాల సమయంలో జోర్హాట్ సందర్శనకు ఉత్తమ సమయం. బయటకు వెళ్లి పరిసర ప్రాంతాలు చూసి రావడానికి, మజూలి కి వెళ్లేందుకు ఇది మంచి సమయం. తేలికపాటి ఉన్నిదుస్తులు వేసుకుంటే సరిపోతుంది.

వేసవి

వేసవి జోర్హాట్ లో వేసవి చాలా వేడిగా, తేమగా వుంటుంది. ఏప్రిల్ లో మొదలయ్యే వేసవి జూన్-జూలై నెలల వరకు వుంటుంది. మే, జూన్ చాలా వేడిగా వుంటాయి. ఇక్కడ అప్పుడు సగటు ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల మధ్య వుంటుంది. వేసవి చివరిలో వానాకాలం వచ్చేస్తుంది.

వర్షాకాలం

వానాకాలం జూలై లో మొదలయ్యే వానాకాలం విస్తారమైన వర్షాలను తీసుకువస్తుంది. తరువాతి రెండు నెలలు వర్షాలు పడ్డాక సెప్టెంబర్, అక్టోబర్ లలో వానాకాలం సద్దుమణుగుతుంది. భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తుతాయి, అందువల్ల జోర్హాట్ సందర్శనకు ఇది మంచి సమయం కాదు. నైరుతి ఋతు పవనాలు జోర్హాట్ కు వానలు తీసుకువస్తాయి.

చలికాలం

శీతాకాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జోర్హాట్ లో ఆహ్లాదకరమైన శీతాకాలం నడుస్తుంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి గానీ అసౌకర్యంగా వుండేంత పడిపోవు. తేలిక పాటి ఉన్నిదుస్తులతో శీతాకాలం వెళ్ళబుచ్చవచ్చు. ఉష్ణోగ్రత 10 డిగ్రీల ప్రాంతంలో వుంది గరిష్టంగా 22 డిగ్రీల వరకు మాత్రమె వెళ్తుంది.