జాప్ ఫు మరియు పూలే బడ్జె శిఖరాలు రెండూ కొహిమా లో ప్రసిద్ధి గాన్చినవే. ఈ రెంటిలోనూ జాప్ ఫు శిఖరం మరింత పేరు గాంచింది. ఇది సముద్ర మట్టానికి 3948 అడుగుల ఎత్తున వుండి పర్యాటకులకు పట్టణం లోని అద్భుత దృశ్యాలు చూపుతుంది. ఈ శిఖరం టవున్ కు 15 కి. మీ. ల దూరం వుంది దోవ అంతా సుందర దృశ్యాలు చూపుతుంది. గిన్నీస్ బుక్ లోకి ఎక్కి ప్రపంచనం లోనే అతి పొడవైన రోడో దేన్ద్రన్ చెట్టు జాప్ ఫు పర్వత శ్రేణులలో మాత్రమే మీరు చూడకలరు. ఈ శిఖరం స్ప్రింగ్ టైం లో చూస్తె మరింత ఆనందంగా వుంటుంది. అపుడు మీరు వివిధ రకాల పక్షులను కూడా సందర్శించవచ్చు.
పూలే బాద్జే శిఖరం జోత్సోమ ప్రాంతానికి సమీపం లో కొహిమ పొలిమేరలలో వుంటుంది. ట్రెక్కింగ్ కు ఇది మంచి శిఖరం. సాహస పర్యాటకులు ఈ పర్వత అధిరోహణకు ఎంతో ఆసక్తి చూపుతారు. పూలే బాజీ శిఖరం కు వెళ్ళే దోవలో మీరు అనేక రకాల వృక్షాలు, జంతువులు చూడవచ్చు.