కొహిమా జంతు ప్రదర్శన శాల దేశం లోని చక్కగా నిర్వహించే జూ లలో ఒకటి. నాగాలాండ్ కు వచ్చే పర్యాటకులకు ఇది ఒక పెద్ద ఆకర్షణ. సహజమైన ప్రదేశంలో అనేక జంతువులు, పక్షులు వాటి నివాసాలలో చూడవచ్చు. ఈ జూ ఒక కొండపై వుంది. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేటపుడు, నాగాలాండ్ లోని వివిధ రకాలం మొక్కల, జంతువుల జాతులను ఆనందించవచ్చు. ఈ జూలో ప్రధాన ఆకర్షణ అంటే త్రాగోపాన్ పక్షి. ఇది వారి రాష్ట్ర పక్షిగా గుర్తించారు. ఈ జాతి పక్షులు చాలా వరకు అంతరించిపోగా ఇప్పటికి సుమారు 500 మాత్రం ఉండవచ్చని అంచనా. ఇక్కడే 'మిథున్' అనే ఒక జాతి దున్నపోతు ను కూడా చూడవచ్చు. ఇది వారి రాష్ట్ర జంతువు. బంగారు కొండముచ్చు, ఆసియా బ్లాకు ఎలుగు వంటి ఇతర అడవి జంతువులను కూడా ఈ జూ లో చూడవచ్చు.