Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్చార్ » వాతావరణం

సిల్చార్ వాతావరణం

ఏడాది పొడవునా ఉష్ణ మండల వాతావరణం కలిగిన సిల్చార్ ని పర్యాటకులు ఏ సమయంలో నైనా సందర్శించవచ్చు. అయినప్పటికీ వర్షాకాలం లో ఈ ప్రాంత పర్యటన మినహాయించడం మంచిది. ఎండాకాలం మరియు శీతాకాలం ఈ ప్రాంత పర్యటనకు అనుకూలమైనది.

వేసవి

మార్చ్ చివరలో మొదలయ్యే వేసవి కాలం జూలై చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్. పగటి పూట వాతావరణం తేమ గా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం సిల్చార్ నగరం లో గణనీయమైన వర్షపాతం నమోదవుతుంది. జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలు ఇక్కడ వర్షాకాలం. ఎండాకాలం వేడి నుండి ఈ వర్షాకాలం ఉపశమనాన్ని కలిగిస్తాయి. భారీ వర్షాల వల్ల రోడ్లు జాం అవుతాయి.

చలికాలం

శీతాకాలం సిల్చార్ లో ని శీతాకాలం ఆహ్లాదకరమైనది. వర్షాలు తగ్గుముఖం పట్టాక వాతావరణం ప్రశాంతం గా మారుతుంది. నవంబర్ చివర్లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్.