అగర్తలా   – అంతఃపురాలూ, దేవాలయాల భూమి !!

ఈశాన్య భారతంలో గువహతి తరువాత ముఖ్యమైన నగరం ఏదైనా వుందంటే, అది త్రిపుర రాజధాని అగర్తలా. పురపాలక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన అగర్తలా ఈ ప్రాంతంలోని రెండో అతి పెద్ద నగరం. బంగ్లాదేశ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వుండే అగర్తలా ఒక సాంస్కృతిక కేంద్రం కూడా.  పశ్చిమ త్రిపురలో వుండే అగర్తలా గుండా హరోవా నది ప్రవహిస్తుంది. ఈ నగరంలో వినోదం, సాహసం, సంకృతి అన్నీ సంగమిస్తాయి. ఫల పుష్ప జాతులు పుష్కలంగా ఉండడంతో అగర్తలా పర్యాటకం చాలా ఆసక్తికరంగా వుంటుంది. భౌగోళికంగాభౌగోళికంగా కూడా అగర్తలా స్థితి ఈ ప్రాంతంలోని రాష్ట్ర రాజధానులన్నిటి కన్నా కొంత భిన్నంగా ఉంటు౦ది. ఈ ప్రాంతంలోని ఇతర రాష్ట్ర రాజధానుల లాగా కాక అగర్తలా, బంగ్లాదేశ్ వరకు విస్తరించి వుండే గంగా-బ్రహ్మపుత్ర మైదానానికి పడమటి వైపు నెలకొని వుంది. అగర్తలాలో పుష్కలంగా వుండే అటవీ ప్రాంతం కూడా ఈ నగరం అందాన్ని పెంపొందించి, అగర్తలా పర్యాటకాన్ని ఆసక్తికరం చేస్తు౦ది.రాష్ట్ర రాజధాని అయినప్పటికీ అగర్తలా చాలా ప్రశాంతంగా వుండే నగరం. ఇక్కడ ఓ పెద్ద నగరంలో వుండే హడావిడి వుండదు. ఇక్కడి ప్రశా౦త వాతావరణం వల్ల ఒక చక్కటి సెలవు దినాన్ని సంస్కృతి, ప్రకృతి ల నడుమ గడిపేయవచ్చు.

అగర్తలా సంక్షిప్త చరిత్ర 19 వ శతాబ్దంలో ఉదయపూర్ లోని రంగమతి నుంచి మాణిక్య వంశపు రాజధానిని మహారాజ కృష్ణ మాణిక్య ఇప్పటి అగర్తలా కు మార్చిన తరువాత ఈ నగర ప్రాచుర్యం లోకి వచ్చింది. రాజ్యానికి నిరంతరం కుకి ల దాడి బెడదగా మారాక రాజధానిని మార్చారు. అప్పటి పొరుగు రాజ్యమైన బ్రిటిష్ వారి బెంగాల్ తో సత్సంబంధాలు కలిగి ఉండాలనే కారణం తో కూడా మహారాజు రాజధానిని మార్చారు.  1940 లలో మహారాజ బీర్ బిక్రం కిషోర్ మాణిక్య బహదూర్ నగరాన్ని పునర్వ్యవస్థితం చేసి, పునః ప్రణాళిక రచించి ఇప్పటి రూపు కల్పించాడు. ప్రణాళికా బద్ధమైన రహదారులు, మార్కెట్ నిరమానం, పురపాలక సంఘం నగరంలో భాగమైనాయి. ఈ పనుల వల్లనే అగర్తలాను బీర్ బిక్రం మాణిక్య బహదూర్ నగరం అని కూడా పిలుస్తారు.

రాజధాని కావడం వల్లా, బంగ్లాదేశ్ కు దగ్గరగా వుండడం వల్లా అగర్తలా చాలా మంది సుప్రసిద్ధ వ్యక్తులకు నిలయంగా వుండేది. రవీంద్రనాథ్ టాగోర్ చాలా సార్లు అగర్తలా సందర్శించారు, త్రిపుర రాజులతో సత్సంబంధాలు కలిగి వుండే వారు.అగర్తలా లోను, చుట్టు పక్కలా పర్యాటక కేంద్రాలు

అగర్తలా లోను చుట్టు పక్కలా చాలా ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు వున్నాయి. ప్రాచీన గత వైభవాన్ని కలిగి వుంటూనే ఆధునికతకు స్థానం కల్పించిన అతి కొద్ది ఈశాన్య నగరాల్లో అగర్తలా ఒకటి. పాత ప్రాసాదాలు, రాజ భవనాలు ఉండగానే, ఆధునిక నిర్మాణాలకు తావిచ్చి అగర్తలా ఈ ప్రాంతానికి కొత్త రంగులు అద్దింది.

Please Wait while comments are loading...