Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఉదయపూర్ - త్రిపుర

ఉదయపూర్ - పవిత్రమైన సరస్సు నగరం !

10

చిన్న ఈశాన్య రాష్ట్రం అయిన త్రిపుర కి దక్షిణాన ఉన్న ప్రసిద్ది చెందిన చిన్న పట్టణం ఉదయపూర్. దక్షిణ త్రిపురా జిల్లాకు ఇది హెడ్ క్వార్టర్స్ గా వ్యవహరిస్తుంది. రాజస్తాన్ తో సరి సమానంగా పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ ఉదయపూర్ తనదైన ప్రత్యేకత కలిగినది.

ఉదయపూర్ లో ఇంకా చుట్టూ పక్కల పర్యాటక ప్రదేశాలు

అనేకమైన ఆలయాలకి ఉదయపూర్ ప్రసిద్ది. స్థానిక దైవం త్రిపురా సుందరి దేవిని అలాగే ఇతర దేవతలని కొలవడానికి ఏంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ ప్రాంతపు అందాలని రెట్టింపు చేసే అనేకమైన సరస్సులను ఈ నగరం లో గమనించవచ్చు. అందుకే ఇది సరస్సుల నగరం గా కూడా ప్రసిద్ది చెందింది. ఉదయపూర్ లో ఉన్న సరస్సులు అన్నీ మానవనిర్మితమైనవి. ధని సాగర్, మహాదేవ దిఘి, జగన్నాథ్ దిఘి మరియు అమర్ సాగర్ వాటిలో కొన్ని. త్రిపుర లో ని అగర్తల తరువాత రెండవ పెద్ద నగరము అయిన ఉదయపూర్ దక్షిణ త్రిపుర జిల్లాకు హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తుంది. ఈ నగరం గుండా ప్రవహించే గోమతి నది ఇక్కడ వ్యవసాయానికి సహాయం అందిస్తోంది. అగర్తల నుండి 55 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఉదయపూర్ కి ప్రైవేటు వాహనాల ద్వారా లేదా రాష్ట్ర రవాణా బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

ఉదయపూర్ లో ఉన్న అన్ని ఆలయాలలో 1501 లో నిర్మితమయిన త్రిపురా సుందరి ఆలయం అత్యంత ప్రసిద్ది చెందినది. అధిక సంఖ్య లో రాష్ట్రం నలు మూలల నుండి భక్తుల తాకిడీ ఉంది. హిందూ పురాణాల ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటి ఇది. ఈ ఆలయాన్ని అనుకుని ఉన్న పెద్ద సరస్సు కళ్యాణ్ సాగర్ సరస్సు. ఉదయపూర్ లో ని భక్తులు ఎక్కువగా సందర్శించే ఆలయాలలో భువనేశ్వరి ఆలయం కూడా ఉంది.

నజ్రుల్ గ్రంధాగర్ అనబడే ప్రజా గ్రంధాలయం కాజి నజ్రుల్ ఇస్లాం అనబడే బెంగాలీ కవి పేరుతొ ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ.

 

ఉదయపూర్ - త్రిపుర ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఉదయపూర్ - త్రిపుర వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఉదయపూర్ - త్రిపుర

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఉదయపూర్ - త్రిపుర

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ఉదయపూర్ కి చేరుకునేందుకు ముఖ్యమైన మార్గం జాతీయ రహదారి. NH 44 త్రిపుర ను అగర్తల నుండి ఉదయపూర్ కి అనుసంధానిస్తుంది. అగర్తల లో ని ఉదయపూర్ తప్పక సందర్శించవలసిన ప్రాంతం కావడం వలన వివిధ రకాల రవాణా సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడి రోడ్లు కూడా మంచి కండిషన్ లో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఉదయపూర్ - త్రిపుర లో రైల్వే స్టేషన్ లేదు. అగర్తల లో ఉన్న రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్నది. సిల్చార్-లుమ్డింగ్ మార్గం లో ఒక రైల్వే లైన్ అగర్తల కి ఉంది. గువహతి కి చేరుకొని ఆ తరువాత ఇంటర్ సిటీ ద్వారా లుమ్డింగ్ లేదా సిల్చార్ కి చేరుకొని అక్కడ నుండి అగర్తల కి పర్యాటకులు రైలు మార్గం ద్వారా చేరాలి. అగర్తల నుండి ఉదయపూర్ కి రెగ్యులర్ రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జోగేంద్ర నగర్ లో ఉన్న రైల్వే స్టేషన్ ఉదయపూర్-త్రిపుర కి సమీపం లో ఉన్నది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ఉదయపూర్ లో ని విమానాశ్రయం లేదు. అగర్తల విమానాశ్రయం ఇక్కడికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. అగర్తల నగరం నుండి 10 కిలోమీటర్ల దూరం లో సింగర్భిల్ విమానాశ్రయం ఉంది. అయితే అగర్తల నగరం ఉదయపూర్ నుండి 55 కిలోమీటర్ల దూరం లో ఉంది. అగర్తల విమనశ్రయం నుండి పర్యాటకులను ఉదయపూర్ కి తీసుకు వెళ్లేందుకు బస్సులు అలాగే టాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri

Near by City