2603 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ తూర్పు గారో హిల్స్, దక్షిణాన దక్షిణ గారో హిల్స్, తూర్పున తూర్పు ఖాసి హిల్స్, పడమర పడమర గారో హిల్స్, ఉత్తరాన అస్సాం లోని భాగాల ద్వారా కట్టుబడి ఉంది. తూర్పు గారో హిల్స్, మేఘాలయ లోని ఖసిస్ తెగ తరువాత రెండవ అతిపెద్ద తెగ గారో తెగ భారీ జనసాంద్రతను కలిగిఉంది. ఈ జిల్లలో హాజోంగ్ లు, రాభా లు, కొచె లు, బనైయ్ లు, డాలు లు, బోరోలు కూడా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.
తూర్పు గారో హిల్స్ వృక్ష, జంతుజాలాలను బాగా కలిగిఉంది. ఇంకా అన్వేషి౦చబడని తూర్పు గారో హిల్స్ పర్యాటకం, శక్తివంతంగా అభివృద్దిచెంది, రాష్ట్ర ఆదాయానికి ఒక ప్రధాన వనరుగా తయారైంది. తూర్పు గారో హిల్స్ పర్యాటకం అత్యద్భుతమైన అందానికంటే ఇంకా ఎక్కువ. చరిత్ర, సంస్కృతి జిల్లా పర్యాటక అవకాశాలు కల్పించడంలో అంతర్భాగమయింది.
తూర్పు గారో హిల్స్ చేరుకోవడ౦ ఎలా
విల్లియంనగర్, గారో హిల్స్ లోని అతిపెద్ద పట్టణం తుర నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. విల్లియంనగర్ నుండి తుర ప్రయాణానికి షుమారు 1 గంట 30 నిముషాలు పడుతుంది. పర్యాటకులు ఈ మార్గంలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులలో వెళ్ళవచ్చు లేదా కాబ్ బుక్ చేసుకోవచ్చు.
తూర్పు గారో హిల్స్ వాతావరణం
తూర్పు గారో హిల్స్ లో వేసవి వేడిగా ఉంటే, శీతాకాలం చలిగా ఉంటుంది. దేశంలోని ఈ భాగంలో వర్షాకాలంలో భారీవర్షాలు కురుస్తాయి. సమశీతోష్ణ వాతావరణం ఉండే వేసవి ప్రారంభం, శీతాకాల సమయంలో తూర్పు గారో హిల్స్ ని సందర్శించడం ఉత్తమం.
తూర్పు గారో హిల్స్ సందర్శనకు ఉత్తమ సమయం
తూర్పు గారో హిల్స్ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం.
తూర్పు గారో హిల్స్ వాతావరణం
తూర్పు గారో హిల్స్ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం. శీతాకాలంలో ఎక్కువ చలి లేకుండా స్థల సందర్శనకు అనువుగా ఉంటుంది. సాహసౌత్సహికులు, పర్వతారోహకులు కూడా ఈ ప్రాంత సందర్శనకు ఇదే మంచి సమయమని గుర్తిస్తారు. అయితే, ఇక్కడికి ప్రయాణించేటపుడు ఊలు దుస్తులు తీసుకెళ్లడం అవసరం.