ఎత్తైన పీఠభూమిపై ఉన్న జోవాయి, సముద్ర మట్టానికి 1380 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఎత్తులో ఉండడం వల్ల వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. జైంతియ హిల్స్ ఖనిజ సంపదను కలిగి ఉంది, జోవాయి చుట్టూ అనేక బొగ్గు గనులు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంత ఆర్ధిక వ్యవస్థ బొగ్గుగనుల వల్ల వర్ధిల్లుతుంది.
జోవాయి లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు
జోవాయి పర్యాటకం జులై రెండవ వారంలో బెహ్దేయిమఖ్లం పండుగను నిర్వహించే సమయంలో సందర్శనను కలిగిఉంటుంది. పినార్ తెగ కమ్యూనిటీ కర్మకాండ వ్యక్తీకరణకు ఈ బెహ్దేయిమఖ్లం పండుగను జరుపుకుంటారు. ఇక్కడ మనిషి చేసిన తడ్లస్కీన్ సరస్సు, లలోంగ్ పార్క్, జోవాయి ప్రెస్బిటేరియన్ చర్చ్ వంటివి జోవాయి పర్యటనలో ఇతర ఆకర్షనల తోపాటు ఉన్నాయి.
జోవాయి చేరుకోవడం ఎలా
జోవాయి, మేఘాలయ రాజధాని షిల్లోంగ్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. జోవాయి చేరుకోవడానికి పర్యాటకులు యాత్ర బస్సులను బుక్ చేసుకోవచ్చు లేదా రాజధాని నుండి ఎక్కువగా నడిచే ఇంటర్-స్టేట్ బస్సులలో ప్రయాణించవచ్చు. విమానంలో వెళ్లాలనుకునే పర్యాటకులు, కోల్కతా నుండి ఉమ్రోయి కి నేరుగా విమానాలు ఉన్నాయి. అయితే, గౌహతి విమానాశ్రయం నుండి విమానాలు ఎక్కడం సరైన ఎంపిక.
జోవాయి సందర్శనకు సరైన సమయం
శీతాకాలం, వేసవికాలం జోవాయి సందర్శనకు అనువుగా ఉంటాయి.