Search
  • Follow NativePlanet
Share

రీ భోయి - ప్రకృతి ఒడిలో...! 

16

నాంగ్పో లో ప్రధాన కేంద్రంగా గల రీ భోయి మేఘాలయలోని 11 జిల్లాల్లో ఒకటి. సౌథ్ గారో హిల్స్ జిల్లా తరువాత మేఘాలయలో అతి తక్కువ జనాభా కల జిల్లా రీ భోయి. ఈ జిల్లాను తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా నుంచి వేరు చేసారు.

రీ భోయి పరిసరాల్లో పర్యాటక ప్రదేశాలు

రీ భోయి పర్యాటకంలో అన్నిటి కన్నా ప్రధాన ఆకర్షణ – బారా పానీ గా పిలువబడే ఉమియం సరస్సు. మానవ నిర్మితమైన ఈ సరస్సు ఒక ప్రధాన జలవిద్యుత్ ఆనకట్ట. ఈ సరస్సు ఇక్కడి క్రీడా సౌకర్యాలకు కూడా ప్రసిద్ది. పర్యాటకులు ఇక్కడ కయాకింగ్, వాటర్ సైక్లింగ్, బోటింగ్ లను ఆస్వాదించవచ్చు. విహార యాత్రలకు వెళ్ళడానికి లామ్ నెహ్రూ పార్కు బాగా ప్రసిద్ది. లం సోపెట్నేంగ్, డైన్గై శికారం, ద్వార్క్ సూద్ ఇక్కడి ఇతర పర్యాటక ఆకర్షణలు.

రీ భోయి సందర్శనకు ఉత్తమ సమయం

వాతావరణం పొడిగా వుండి ప్రయాణానికి అనుకూలంగా వుండే వేసవి లో రీ భోయి సందర్శించడం మంచిది.

రీ భోయి ఎలా చేరుకోవాలి

రీ భోయి జిల్లా కేంద్రం నాంగ్పో షిల్లాంగ్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో వుంది. గువహతిషిల్లాంగ్ రహదారి లో మధ్యలో వుంది ఈ వూరు. 40 వ నెంబర్ జాతీయ రహదారి రీ భోయి జిల్లాలోని చాలా భాగం గుండా వెళ్తుంది. గువహతి నుంచి ప్రైవేటు టూరిస్ట్ వాహనాలు, బస్సుల్లో నాంగ్పో కు పర్యాటకులు తేలిగ్గానే చేరుకోవచ్చు.

రీ భొఇ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రీ భొఇ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రీ భొఇ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రీ భొఇ

  • రోడ్డు ప్రయాణం
    40 వ నెంబర్ జాతీయ రహదారి ఈ జిల్లాకు జీవ నాది లాంటిది. జాతీయ రహదారి ఈ జిల్లా అంతటా వ్యాపించి వుండనప్పటికీ, ఇది జిల్లా లో నిలువుగా వెళ్తూ షిల్లాంగ్ ను గువహతి కి కలుపుతుంది. ఈ రహదారి నిత్యం నడిచే బస్సులు, టూరిస్ట్, ప్రైవేటు వాహనాలతో నిత్యం రద్దీగా వుంటుంది. షిల్లాంగ్ లేదా గువహతి నుంచి నాంగ్పో చేరుకోవడం తేలిక.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వున్న గువహతి రీ భోయి జిల్లాకి సమీప రైల్వే స్టేషన్. రద్దీ సమయాల్లో నాంగ్పో నుంచి గువహతి వెళ్ళడానికి గంటన్నర సమయం పడుతుంది. దేశంలోని అన్ని మూలాలకు రైళ్ళు నడిచే గువహతి రైల్వే స్టేషన్ దేశంలో రద్దీ గా వుండే రైల్వే స్టేషన్లలో ఒకటి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    మేఘాలయ లోని ఉమ్రోయి లో వుండే ఏకైక విమానాశ్రయం రీ భోయి జిల్లలోకే వస్తుంది, ఉమియం సరస్సుకు దగ్గరగా వుంటుంది. అయితే, ఇక్కడి నుంచి కోల్కతా కు ఒక్క విమానమే తిరుగుతుంది. పర్యాటకులు గువహతి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి జాత్యీయ రహదారి గుండా నాంగ్పో చేరుకోవడం మంచిది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu