Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రీ భొఇ » వాతావరణం

రీ భొఇ వాతావరణం

రీ భోయి జిల్లాలో ప్రతి ఋతువుకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్నప్పటికీ, వేసవి లో ఇక్కడికి రావడం మంచిది. వేసవిలో పొడిగా వుండే వాతావరణం ప్రయాణానికి అనుకూలంగా వుంటుంది. ఎండ వల్ల కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ ఎల్లెడలా వుండే పచ్చదనం దాని తీవ్రత తగ్గిస్తుంది.

వేసవి

మే, జూన్, జూలై నెలల్లో ఇక్కడ వేసవి వుంటుంది. రీ భోయి జిల్లాలో వేసవి ఒక మాదిరి నుంచి తీవ్ర అసౌకర్యం కలిగించేంత వేడిగా వుంటుంది. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు వెళ్తాయి, కానీ, సగటు ఉష్ణోగ్రత సుమారు 25 డిగ్రీలు వుంటుంది, ప్రత్యేకంగా నాంగ్పో లో. ప్రతి ఏటా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరుగుతూనే వుంది.

వర్షాకాలం

రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలలాగే రీ భోయి జిల్లాలో కూడా వర్షాకాలం లో భారీ వర్షాలు పడతాయి. జూన్ చివరికి గానీ జూలై లో గానీ మొదలయ్యే వానాకాలం సెప్టెంబర్ అక్టోబర్ ల వరకు వుంటుంది. అయితే, గడచిన కొన్ని ఏళ్లుగా పెరుగుతున్న భూ తాపం వల్ల వర్షపాతం తగ్గుతూ వస్తోంది – ఉమియం సరస్సులో తగ్గుతున్న నీటి స్థాయి దీనికి రుజువు.

చలికాలం

డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో శీతాకాలం వుంటుంది. ఉష్ణోగ్రత బాగా తగ్గి ఇక్కడి వాతావరణం చాలా చల్లగా అవుతుంది. ఉష్ణోగ్రత దాదాపు 4 డిగ్రీల స్థాయి దాకా తగ్గిపోతుంది. శీతాకాలం లో ఈ జిల్లాలో కొద్ది రోజులు ఉండాలనుకుంటే వెచ్చని ఉన్ని దుస్తులు తీసుకు వెళ్ళడం తప్పని సరి.