మేఘాలయ లోని రి-భోయి జిల్లాకు నాంగ్పో పరిపాలనా కేంద్రం, చౌకగా పళ్ళు, కూరలు కొనాలనుకునే వారికి ఇది ఒక ప్రసిద్ధ మార్కెట్. ఖాసి రుచులు చవిచూడడానికి నాంగ్పో సరైన ప్రదేశం. నాంగ్పో మార్కెట్ రోజంతా జనాలతో రద్దీగా ఉంటుంది. వాళ్ళలో కొంతమంది స్థానికులు కాగా ఎక్కువమంది పర్యాటకులే.
ఈ ప్రాంతంలో ఒకటి రెండు రోజులు బస చేద్దామనుకునే వారికి బ్రీజేడేల్ టూరిస్ట్ రిసార్ట్ మంచి ఎంపిక. విలాసవంతంగా ఉండే ఈ హోటలు యాజమాన్యం కూడా చాలా మర్యాదగా, సాయపడేలా ఉంటారు. 40 వ జాతీయ రహదారిపై ఉన్న నాంగ్పో, షిల్లాంగ్ నుండి 52 కిలోమీటర్లు, గువహతి నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. షిల్లాంగ్ లేదా గువహతి నుండి అద్దె టూరిస్ట్ వెహికల్ ద్వారా నాంగ్పో చేరుకోవచ్చు, పల్లెటూరి రోడ్ల గుండా అద్భుతమైన సవారీ మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది.