Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కూచ్ బెహార్

కూచ్ బెహార్  – కూచ్ బెహార్ సంస్కృతి!  

11

కూచ్ బెహార్, పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతంలోని పట్టణాలలో ఒకే ఒక్క ప్రణాళిక పట్టణం. అంతటా స్థాయిని, వారసత్వాన్ని తెలియచేస్తుంది. పురాతన కాలంలో, బీహార్ సంస్థాన రాష్ట్రానికి ప్రధాన కార్యాలయమైన ఈ పట్టణం ప్రస్తుతం వలస నిర్మాణ శైలిలోని భవనాలు ఒక పక్క, శక్తివంతమైన హిమాలయాలు మరొక పక్క ఉన్న ఒక ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్ర౦.

 కూచ్ బెహార్, తూర్పు హిమాలయాల పర్వతపాదాల చెంతన ఉంది. మంచుతో కప్పిన విశాలమైన ఆల్పైన్ అడవులతో కూడిన మంచు కప్పిన పర్వతాలు ప్రాకృతిక అమరికతో ఉంటాయి. కూచ్ బెహార్ బెంగాలి, బౌద్ధమతము, టిబెట్ వంటి అనేక సంస్కృతులతో ఒకే విధంగా ప్రభావితమై, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి ఒక పరిపూర్ణ ఉదాహరణగా నిలుస్తుంది.

కూచ్ బెహార్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

కూచ్ బెహార్ పర్యాటక రంగం, పర్యాటకుల కోసం చాల ముఖ్యమైన కొన్ని ప్రాంతాలను సందర్శనకు అందిస్తుంది. బనేశ్వర శివాలయం, బారాదేవి బరి ఆలయం, ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం గోసనిమరి రాజపథ్ వంటివి కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఉన్నాయి. ఇవి కూచ్ బెహార్ లోని కొన్ని పర్యాటక ఆకర్షణలు.

కూచ్ బెహార్ లో పండుగలు

కూచ్ బెహార్, తోర్స నదికి అతి చేరువలో ఉంది. వర్షాకాలంలో ఇక్కడ కురిసే భారీ వర్షాల వలన ఈ ప్రాంతానికి రావడ౦ కొన్ని సార్లు వీలు పడదు. కూచ్ బెహార్ లోని స్థానికులు వినోద ప్రియులు. దీపావళి, దుర్గా పూజ, కాళీ పూజ, దసరా వంటి అన్ని ప్రధాన భారతీయ, బెంగాలి పండుగలను జరుపుకొంటారు. ఏడాది పొడవునా వేడుకలకు ఇక్కడ ఆతిధ్యమిస్తారు. ఉత్తర బెంగాల్ లో రాస్ మేలా పురాతన వేడుకలలో ఒకటి.

ఆహారం

కూచ్ బెహార్ లో ఉన్నప్పుడు మీరు రకరకాల వంటకాలను ప్రయత్నించవచ్చు. భునా కిచిడి, లబ్ర స్థానికులు మెచ్చే వంటకాలు. రోడ్డు పక్కన అమ్మే మోమోలు అనే కుడుములతో బాటు బంగ్లాదేశ్, బెంగాలి వంటకాలే కాక రోడ్డు పక్కన ఉన్న అనేక స్టాల్సు, రెస్టారెంట్లు, అల్పాహారశాలలు రకరకాల వంటలను అందిస్తాయి. స్థానిక సముద్ర వంటకాలను, ఘటిగరం, జల్మురి వంటి స్థానిక ప్రత్యేకతలను ప్రయత్నించడ౦ మరవకండి.

కూచ్ బెహార్ స్థానికులు ఎంతో కలసి మెలసి ఉంటారు. అందువల్ల పర అనే ప్రతి పొరుగు ప్రాంతంలో ఒక స్వంత సామాజిక క్లబ్బు, వినోద కేంద్రం, ఆహారశాల ఉంటాయి. సమాజాలవారు తరచూ కలసి వేడుకలను జరుపుకుంటారు. ఇక్కడ విద్య కూడా ఎంతో అభివృద్ది చెందింది. ముందుగా కొన్ని మంచి స్కూళ్ళతో తర్వత అనేక ఇంజనీరింగ్ సంస్థలు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. పొరుగు పట్టణాల నుండి విద్యార్ధులు, చదువు కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడ నివాసముంటున్నారు.

క్రీడలు

పశ్చిమ బెంగాల్ లోని మిగిలిన ప్రాంతాల లానే, స్థానికులు అన్ని రకాల క్రీడలను ఆడతారు. ఎం జే ఎన్, కూచ్ బెహార్, నెహ్రు స్టేడియంలో స్థానికులు, పర్యాటకులు క్రీడలలో పాల్గొనడానికి సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి.

పరిశ్రమల గురించి

పర్యాటకుల కోణం నుండే మాత్రమే చూడక, కూచ్ బెహార్ ను ప్రధానంగా పరిశ్రమల పట్టణం అంటారు. ఇక్కడ అనేక సంస్థలు ఏర్పాటు చేసిన సౌకర్యాల వలన ఉపాధి అవకాశాలు వేగంగా పెరిగాయి. కూచ్ బెహార్లో ఒంటరి ప్రయాణీకుడు, ఒక జంట లేదా ఒక కుటుంబం, ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి ఉంది. ఉత్తర బెంగాల్ లోని ప్రధాన పట్టణాలకు ఇక్కడ నుండి మార్గం ఉంది. చిన్న పట్టణాల సందర్శన కూడా ఇక్కడ నుండి సులభమౌతుంది. సిలిగురి కొన్ని గంటల దూరంలోనే ఉంది.

కూచ్ బెహార్ పర్యటనకు ఉత్తమ సమయం

ప్రయాణానికి ఉత్తమంగా ఉండే శీతాకాలం కూచ్ బెహార్ పర్యటనకు అనువుగా ఉంటుంది.

కూచ్ బేహార్ చేరడం ఎలా

కూచ్ బెహార్ నుండి దేశం లోని మిగిలిన ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యం ఉంది. సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నగరానికి అతి దగ్గరగా ఉంది. గువహతి నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు చక్కటి రోడ్డు మార్గం కూడా ఉంది.

కూచ్ బెహార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కూచ్ బెహార్ వాతావరణం

కూచ్ బెహార్
26oC / 78oF
 • Partly cloudy
 • Wind: E 23 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం కూచ్ బెహార్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? కూచ్ బెహార్

 • రోడ్డు ప్రయాణం
  కూచ్ బెహార్ రోడ్డు మార్గం ద్వారా పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతంలోని ఒక ముఖ్య నగరం సిలిగురి నుండి జాతీయ రహదారి 31, 31 డి లు కూచ్ బేహార్ ను కలుపు తాయి. ఇది సిలిగురికి సుమారు 141 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం ద్వారా జల్పాయి గురి, సిలిగురి స్టేషన్లు కూచ్ బెహార్ ను రాష్ట్రంలోని, దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయి. కూచ్ బెహార్ లో రైలుస్టేషన్
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమానమార్గం ద్వారా కూచ్ బెహార్ లో విమానాశ్రయం కొన్ని సార్లు పని చేయదు. కూచ్ బేహార్ నుండి సుమారు 153 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలిగురి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉన్న చక్కటి రోడ్డు మార్గం ద్వారా చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Jul,Tue
Return On
24 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
23 Jul,Tue
Check Out
24 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
23 Jul,Tue
Return On
24 Jul,Wed
 • Today
  Cooch Behar
  26 OC
  78 OF
  UV Index: 6
  Partly cloudy
 • Tomorrow
  Cooch Behar
  23 OC
  74 OF
  UV Index: 6
  Moderate rain at times
 • Day After
  Cooch Behar
  24 OC
  75 OF
  UV Index: 6
  Patchy rain possible