Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జోధ్పూర్

జోధ్పూర్ - నీలి నగరం – నీలి వర్ణపు అద్భుత గాధ !

72

రాజస్థాన్ లో జైపూర్ తరువాత రెండో అతి పెద్ద ఎడారి నగరం జోధ్పూర్. ఈ నగరానికి రెండు ప్రత్యేకతల కారణంగా రెండు ముద్దుపేర్లు వున్నాయి –‘సన్ సిటీ’, ‘బ్లూ సిటీ’. జోధ్పూర్ లోని ప్రకాశవంతమైన, ఎండా వుండే వాతావరణం వల్ల ‘సన్ సిటీ’ అనే పేరు రాగా, మేహ్రాన్ ఘర్ కోట చుట్టూ వుండే నీలి రంగు ఇళ్ళ వల్ల ‘బ్లూ సిటీ’ అనీ పేరు పడింది.

థార్ ఎడారి అంచున వుండడం వల్ల దీన్ని ‘థార్ కు ముఖద్వారం’ గా కూడా పిలుస్తారు. ఈ నగరాన్ని 1459 లో రాథోడ్ వంశానికి చెందిన నాయకుడు రావ్ జోదా స్థాపించారు. పూర్వం దీన్ని మార్వాడ్ గా పిలిచేవారు, ప్రస్తుత౦ వ్యవస్థాపకుడైన రాజపుత్ర నాయకుడు రావ్ జోదా పేరిట జోధ్పూర్ గా పిలుస్తున్నారు.

సాంప్రదాయ రుచులుజోధ్పూర్ సందర్శించే పర్యాటకులు పెరుగు, పంచదార తో తయారుచేసిన మఖనియా లస్సి వంటి మంచిరుచికర సాంప్రదాయ వంటలను రుచి చూడవచ్చు. అంతేకాక, మావా కచోరి, ప్యాజ్ కి కచోరి, మిర్చి వడ తోసహా మంచి రుచి, వాసనలు కలిగిన వంటకాలు కూడా ఆహరప్రియులను ఆకర్షిస్తాయి.

స్థానిక రాజస్థానీ వంటలతో పాటు పర్యాటకులు నగరంలోని సోజాతి గేటు, స్టేషన్ రోడ్డు, త్రిపోలియా బజారు, మోచి బజారు, నయి సడక్, క్లాక్ టవర్ వంటి రంగుల మార్కెట్ లో స్థానిక హస్తకళాకృతులు, అలంకరించిన బూట్లు, బహుమతుల కోసం కూడా షాపింగ్ కి వెళతారు. ఈ నగరం భారతదేశం లో ఎర్ర మిరపకాయలకు అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ది చెందింది. సరదాలు, సంతలు, పండుగలుజోధ్పూర్ సంవత్సరం మొత్తం జరిగే వివిధ పండుగలకు ప్రసిద్ది చెందింది.

నగరంలోని పోలో మైదానం లో ప్రతి సంవత్సరం జనవరి 14న అంతర్జాతీయ ఎడారి గాలిపటాల పండుగ జరుగుతుంది. ఈ మూడురోజుల పండుగ సమయంలో, ప్రపంచం నలుమూలల నుండి గాలిపటాలు ఎగరేసేవారు ఇక్కడ జరిగే గాలిపటాల పోటీలలో అగ్ర స్థానం కోసం పోటీపడతారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో వాయు సేన హెలికాప్టర్ల నుండి రంగురంగుల గాలిపటాలను ఆకాశంలో వదులుతారు. పర్యాటకులు ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్-అక్టోబర్) మార్వార్ పండుగను జరుపుకుంటారు.

ఈ రెండురోజుల పండుగలో జానపద సంగీతాన్ని, రాజస్థానీ నృత్యాన్ని ఆస్వాదించవచ్చు. అంతేకాక, జోధ్పూర్ నాగార్ ఉత్సవం రాజస్తాన్ లోని రెండవ అతిపెద్ద పశువుల సంత. దీనిని జనవరి, ఫిబ్రవరి మాసాలలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఇది ‘నాగౌర్ పశువుల సంత’ గా ప్రసిద్ధిచెందింది, ఈ సంతలో 70,000 ఎద్దులు, ఒంటెలు, గుర్రాల క్రయ విక్రయాలు జరుగుతాయి. ఈ సందర్భంగా జంతువులను అందంగా అలంకరిస్తారు. ఒంటెల పందాలు, ఎడ్ల పందాలు, గారడీ విద్య, తోలుబోమ్మలాటలు, కధలు చెప్పేవారు ఈ పండుగ ప్రధాన ఆకర్షణలు. వాస్తు నిర్మాణ శైలుల మిశ్రమంజోధ్పూర్ సాంప్రదాయ వంటలు, షాపింగ్, పండుగలకే కాకుండా, పురాతన రాచరికపు కోటలు, అందమైన భవనాలు, తోటలు, దేవాలయాలు, హెరిటేజ్ హోటళ్లకు కూడా ప్రసిద్ధిచెందింది. పర్యాటక ఆకర్షణలతో పాటు ఉమైద్ భవన్ పాలెస్ చెప్పుకోదగిన కట్టడం. ఈ అందమైన పాలెస్ ఇండో-వలసరాజ్య, చిత్రకళా విధాన శైలికి ఒక సరైన ఉదాహరణ. చెక్కిన ఇసుకరాళ్ళు ఈ భవనానికి అద్భుతమైన రూపాన్ని ఇచ్చాయి.

పర్యాటకులు ఉమేద్ భవన్ ప్యాలస్ లో ఒక భాగమైన ఉమేద్ భవన్ ప్యాలస్ మ్యూజియం లో విమానాల నమూనాలు, ఆయుధాలు, పురాతన గడియారాలు, బాబ్ గడియారాలు, టపాకాయలు, కత్తులు, రాళ్ళు, ఛాయాచిత్రాలు, వేట విజయ చిహ్నాలు చూడవచ్చు. మేహ్రాన్ ఘర్ కోట జోధ్పూర్లోని ప్రసిద్ది చెందిన కోటలలో ఒకటి. ఈ కోట మోతీ మహల్, ఫూల్ మహల్, శీశా మహల్, ఝా౦కీ మహల్ వంటి అందమైన భవనాలకి ప్రసిద్ధిచెందింది. ఈ కోటకి చరిత్ర ప్రసిద్ది చెందిన ఏడు ద్వారాలు ఉన్నాయి. ఈ కోట లోపల రాచరిక పల్లకీల భారీ సేకరణ ప్రదర్శి౦చే మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలోని 14 ప్రదర్శన గదులు రాచరిక ఆయుధాలు, ఆభరణాలు, వస్త్రాలతో అలంకరించబడి ఉన్నాయి.

ఆకర్షణల కలగూరగంప సెలవలలో జోధ్పూర్ రావాలనుకునే పర్యాటకులు అందమైన మండోర్ తోటలోని జోధ్పూర్ రాజుల సమాధులు చూడవచ్చు. ఈ సమాధులు, గొడుగు ఆకారంలోని సాధారణ సమాధుల కన్నా వేరుగా ఉంటాయి. రెండు సమీప సభా మందిరాలు, ముక్కోటి దేవతల మందిరం, వీరుల సభా మందిరం ఈ తోటకు అదనపు ఆకర్షణ. మహామందిర ఆలయం, రసిక్ బిహారీ ఆలయం, గణేష్ ఆలయం, బాబా రామ్ దేవ్ ఆలయం, సంతోషీమాత ఆలయం, చాముండ మాత ఆలయం, అచల్ నాద్ శివాలయం జోధ్పూర్ లోని ప్రసిద్ధ మందిరాలు.చుట్టూ వుండే అందమైన తోట మధ్య వున్న బల్సమండ్ అందమైన సరస్సు. పర్యాటకులు ఈ సరస్సు ఎదురుగా బల్సమండ్ లేక్ పాలెస్ ని చూడవచ్చు. ఈ పాలెస్ ఇపుడు సాంప్రదాయ రాజపుతానా నిర్మాణ శైలిని ప్రదర్శించే ప్రసిద్ధ హెరిటేజ్ హోటల్ గా మార్చబడింది. మరో కృత్రిమ జలవనరు కైలానా సరస్సు తన సహజ సౌందర్యానికి ప్రసిద్ధిచెందింది. తరువాత, పర్యాటకులు సరస్సులో బోటింగ్ చేయడమే కాక విహారయాత్రకి సరస్సు ఒడ్డుకి వెళ్ళవచ్చు. గుడా బిష్నాయ్ గ్రామం జోధ్పూర్ సందర్శించే పర్యాటకులు అందరినీ ఆకర్షిస్తుంది. ఇది హరిణాలు, కృష్ణ జింకలను ఆరాధించే స్థానిక గిరిజనుల ప్రత్యేక కుగ్రామం.

వన్యప్రాణుల ప్రియులు ఇక్కడ నెమళ్ళు, నల్ల లేళ్ళు, జింకలు, కొంగలు, వలస పక్షులను చూడవచ్చు. జోధ్పూర్ సందర్శించేటపుడు, జంతుప్రేమికులు బల్లులు, అడవి నక్కలు, బ్లూ బుల్స్, ముంగీస, కుందేలు, అడవి పిల్లులు, కోతులను మచియా సఫారీ పార్క్ లో చూడవచ్చు. ఈ పార్కు జోధ్పూర్ నగరం నుండి 9 కిలోమీటర్ల దూరంలో జోధ్పూర్-జైసల్మేర్ మార్గంలో ఉంది. యాత్రికులు అభయ్ సింగ్ మహారాజు ఏర్పాటు చేసిన ఈ అందమైన చోకెలావ్ బాగ్ లో విశ్రాంతి పొందవచ్చు. ఈ తోట లోపల మూడు ప్రదేశాలు ఉన్నాయి, ప్రతి ప్రాంతం ఒక విశిష్ట నేపథ్యాన్ని ఉపయోగించి రూపొందించబడింది. అంతేకాక, జస్వంత్ టాడ కూడా ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు. క్లిష్టమైన పాలరాయి చేక్కుళ్ళతో అలంకరించబడిన ఈ భవనాన్ని ‘మార్వార్ తాజ్ మహల్’ అనికూడా పిలుస్తారు. జెనానా మహల్, లోహా పాల్, ప్రభుత్వ మ్యూజియం, ఘంటా ఘర్, జస్వంత్ సాగర్ ఆనకట్ట, రాయ్ కా బాగ్ ప్యాలెస్, మరియు ఉమేద్ గార్డెన్స్ ఈ నగర ఇతర పర్యాటక ఆకర్షణలు.

జోధ్పూర్ చేరుకోవడంజోధ్పూర్ నగరంలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఉన్నాయి, ఇవి భారతదేశంలో ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప౦ లో వుంది. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి జైపూర్, డిల్లీ, జైసల్మేర్, బికనేర్, అహ్మదాబాద్, అజ్మీర్, ఉదయపూర్, ఆగ్రా నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి. సంవత్సరం మొత్తం ఈ ప్రాంతంలోని వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది. ఇక్కడ వేసవి, వర్షాకాలం, శీతాకాలం ప్రధాన కాలాలు. జోధ్పూర్ సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి ఉత్తమ సమయం.

జోధ్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జోధ్పూర్ వాతావరణం

జోధ్పూర్
32oC / 90oF
 • Sunny
 • Wind: WSW 22 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం జోధ్పూర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? జోధ్పూర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ద్వారా: సమీప నగరాల నుండి జోధ్పూర్ కి రాజస్తాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్.ఎస్.ఆర్.టి.సి) వారి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు జైపూర్. డిల్లీ, జైసల్మేర్, బికనేర్, ఆగ్రా, అహ్మదాబాద్, అజ్మీర్, ఉదయపూర్, ఆగ్రా నుంచి ప్రైవేట్ డీలక్స్ బస్సులలో జోధ్పూర్ కి వెళ్ళవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ద్వారా: జోధ్పూర్ రైల్వే స్టేషన్ కి జైపూర్, డిల్లీ, ముంబై, చెన్నై, జైసల్మేర్, బెంగళూర్, కోల్కత్త నుంచి తరచుగా రైళ్ళు ఉన్నాయి. పర్యాటకులు స్టేషన్ నుండి నగరం చేరుకోవడానికి టాక్సీలు, ఆటోరిక్షాలు ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  ప్రయాణానికి ఉత్తమ మార్గం జోధ్పూర్ కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయు మార్గం ద్వారా: సిటీ సెంటర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో జోధ్పూర్ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయానికి డిల్లీ, ముంబై, ఉదయపూర్, జైపూర్ నుంచి విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. పర్యాటకులు ఈ విమానాశ్రయం నుండి జోధ్పూర్ నగరం వెళ్ళడానికి టాక్సీలు, మూడు చక్రాల రిక్షాలు అందుబాటులో ఉన్నాయి. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ ప్రాంతానికి చేరుకుంటారు.
  మార్గాలను శోధించండి

జోధ్పూర్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jul,Mon
Return On
23 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Jul,Mon
Check Out
23 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Jul,Mon
Return On
23 Jul,Tue
 • Today
  Jodhpur
  32 OC
  90 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Jodhpur
  30 OC
  86 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Jodhpur
  30 OC
  85 OF
  UV Index: 8
  Sunny