Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు » మేహ్రాన్ ఘర్ కోట

మేహ్రాన్ ఘర్ కోట, జోధ్పూర్

6

 జోధ్పూర్ మేహ్రాన్ ఘర్ 150 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద కొండపై నెలకొని వుంది. ఈ అద్భుతమైన కోట ను 1459 లో రావ్ జోదా నిర్మించాడు. ఈ కోటను రోడ్డు మార్గం ద్వారా జోధ్పూర్ నుంచి చేరుకోవచ్చు. ఈ కోటకు దారి తీసే ఏడు ద్వారాలు వున్నాయి – వాటిలోని రెండో ద్వారంలో ఇక్కడ జరిగిన యుద్ధాల్లో ఫిరంగి గుళ్ళు తగిలి దెబ్బ తిన్న గోడల మీద మచ్చలు కూడా చూడవచ్చు.

కోటను అంబర్ సేనల నుంచి రక్షిస్తూ నేలకొరిగిన కిరాత్ సింగ్ సోడా అనే యోధుని చత్రి కూడా ఇక్కడ వుంది. చాత్రి అంటే రాజపుత్రుల గౌరవ మర్యాదలకు ప్రతీక గా నిర్మించే గోపురం లాంటి ఆవరణ.జై పోల్ గేట్, మాన్ సింగ్ మహారాజు బికనేర్, జైపూర్ సైనికులపై విజయోత్సాహంతో నిర్మించాడు. మొఘలుల ఓటమి గుర్తుగా అజిత్ సింగ్ మహారాజు ఫతే పోల్ పేరుతొ వేరొక ద్వారాన్ని నిర్మించాడు.

కోటలోని ఒక భాగం రాచరిక పల్లకీల భారీ సేకరణతో ఒక మ్యూజియంగా మార్చబడింది. 14 ప్రదర్శన గదులు కలిగిన ఈ మ్యూజియం ఆయుధాలతో, ఆభరణాలతో, వస్త్రాలతో అలంకరించబడి ఉంది. అంతేకాకుండా, సందర్శకులు మోతీ మహల్, ఫూల్ మహల్, శీశ మహల్, ఝాన్కి మహల్ వంటి నాలుగు గదులను చూడవచ్చు. కోటలోని అతిపెద్ద గది అయిన మోతీ మహల్ ని పెర్ల్ పాలెస్ అని కూడా పిలుస్తారు.

ఇక్కడ పర్యాటకులు జోధ్పూర్ రాచరిక సింహాసనం ‘శ్రింగర్ చౌకీ’ ని చూడవచ్చు. రాజుగారి ఐదుగురు రాణులూ సభా కార్యకలాపాలు వినడానికి ఉపయోగించే రహస్య బల్కనీలకు దారి తీసే ఐదు అరలు ఉన్నాయి. ఫూల్ మహల్, మేహ్రంగర్ కోట ప్రాచీన గదులలో ఒకటి. ఈ భవనాన్ని రాజులు వ్యక్తిగత పనులకు ఉపయోగించేవారు. దీనిని పాలెస్ ఆఫ్ ఫ్లవర్స్ అనికూడా పిలుస్తారు, దీని పైకప్పు బంగారపు జరీకుట్టు పనితనంతో గొప్పగా ఉంటుంది.

ఈ భవనాన్ని 18వ శతాబ్దంలో అభయ్ సింగ్ మహారాజు నిర్మించారు. ఈ రాజు మొఘల్ యోదుడైన సర్బులంద్ ఖాన్ ను ఓడించిన తరువాత అహ్మదాబాద్ నుండి బంగారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా కొల్లగొట్టాడు. రెండవ జస్వంత్ సింగ్ మహారాజు శకంలో రాచరిక చిత్రాలూ, రాగమాలా చిత్రాలూ ఈ భవనానికి తెచ్చారు. శీశ మహల్ అందమైన అద్దాలతో అలంకరించబడి ఉంది. పర్యాటకులు ఈ భవనంలో కళ ఉట్టిపడే దేవతల చిత్రాలను ప్రదర్శించే అద్దాల పనితనాన్ని చూడవచ్చు. దీనిని ‘హాల్ ఆఫ్ మిర్రర్’ అనికూడా అంటారు. తాఖత్ సింగ్ నిర్మించిన తాఖత్ విలా ని కూడా చూడవచ్చు. ఇతను జోధ్పూర్ చివరి పాలకుడు, మేహ్రంగర్ కోటలో నివసించిన వాడు.

ఈ విలా నిర్మాణ శైలి సాంప్రదాయ, ఆధునిక శైలి రెంటినీ ప్రదర్శిస్తుంది. ఝాన్కి మహల్ అందమైన భవనం, ఈ భవనాన్ని రాచరిక స్త్రీలు ఆస్థానంలో జరిగే రాచకార్యాలను పరిశీలించడానికి ఉపయోగించేవారు. ఈ భవనం ప్రస్తుతం రాచరిక ఉయ్యాలల భారీ సేకరణ ప్రదేశం. ఈ ఉయ్యాలలు నకిలీ అద్దాలతో, పక్షుల బొమ్మలతో, ఏనుగులతో, అందమైన బొమ్మలతో అలంకరించబడి ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jun,Sun
Check Out
22 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon