ఘంటా ఘర్, జోధ్పూర్ కి చెందిన కీ.శే సర్దార్ సింగ్ నిర్మింఛిన అందమైన గడియార స్థంభం. ఈ టవర్ కి దగ్గరలో ఉన్న సర్దార్ మార్కెట్ ప్రసిద్ధ షాపింగ్ జోన్. పర్యాటకులు ఈ మార్కెట్ లో రాజస్థానీ వస్త్రాలు, మట్టి బొమ్మలు, చిన్న ఒంటెలు, ఏనుగులు, పాలరాతి పని, సాంప్రదాయ వెండి ఆభరణాలను తగిన ధరలలో కొనుగోలు చేయవచ్చు.