జైసల్మేర్ – బంగారు నగరం. రాజుల ఏకాంతవాసం

‘బంగారు నగరం’ జైసల్మేర్ ఇసుక ఎడారితోపాటు, రాజస్తాన్ లోని రాజ ప్రాసాదాలూ పోరాడే ఒంటెల అందాల సంక్షిప్త చిత్రం. ఈ ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక స్థానం థార్ ఎడారి మధ్యలో ఉంది. అలాగే, జైసల్మేర్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ ఊరు పాకిస్తాన్, బికనేర్, బార్మర్, జోధ్పూర్ లతో సరిహద్దులు పంచుకుంటుంది. రాష్ట్ర రాజధాని జైపూర్ నుంచి ఈ బంగారు నగరం కేవలం 575 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకం, ఈ జిల్లా ఆర్ధికరంగంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. 12 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించి ఈ నగరాన్ని స్థాపించిన రావు జైసల్ పేరిట జైసల్మేర్ ఏర్పడింది.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రాజస్థానీ సంగీతానికి, నృత్య రీతులకు ఈ బంగారు నగరం సుప్రసిద్ధం. ఇక్కడి ఇసుక తిన్నెలపై ఎడారి ఉత్సవాల సమయంలో కల్బెలియా అనే సున్నితైన నృత్యరీతిని స్థానిక గిరిజన తెగలవారు అభినయిస్తారు. ఏటా ఫిబ్రవరి లో మూడు రోజుల పాటు జరిగే పండుగ ఇది. ఒంటెల పందాలు, తలపాగాలు చుట్టడం, మీసకట్టు పందాలు, దూర౦ నుంచి వచ్చే యాత్రికులను ఆకర్షిస్తాయి. మరోవంక, శిబిరాలూ, చలిమంటలు, ఒంటెల మీద ఎడారి ప్రయాణం యాత్రికులకు మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తాయి.

నోరూరించే స్థానిక రుచులు

జైసల్మేర్ వెళ్లాలనుకునే యాత్రికులు ఇక్కడి రాజస్తాన్ సాంప్రదాయ వంటకాల రుచులు చూడవచ్చు. నోరూరించే ముర్గ్-ఎ-సబ్జ్ (కూరగాయ ముక్కలతో వేయించిన మెత్తటి, ఎముకలు లేని చికెన్ వంటకం) ఇక్కడి యాత్రీకుల ఆదరణ చూరగొంది. రుచికరమైన కేర్ సా౦గ్రీ (ఎడారి చిక్కుళ్ళు, కాపర్లు) జైసల్మేర్ కే ప్రత్యేకం. ఆసక్తి ఉన్న యాత్రికులు జైసల్మేర్ లోని రెస్టారెంట్లలో దొరికే భానోన్ ఆలూ (ఆలూ లో పుదీనా పేస్ట్ కూరి గుజ్జుతో తయారుచేసిన కూర) కడీ పకోడా (పెరుగులో పిండివేసి వండింది) కూడా రుచి చూడవచ్చు.

ఇది స్థల సందర్శన కన్నా ఎక్కువ....

రాజస్తాన్ లోని ఇతర ఎడారి నగరాలలో లాగే జైసల్మేర్ కూడా కోట్లకు, భవంతులకు, రాజప్రాసాదలకు, మ్యూజియం లకు దేవాలయాలకు ప్రసిద్ధం. జైసల్మేర్ కు గర్వకారణంగా భావించబడే జైసల్మేర్ కోట ఈ బంగారు నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. సూర్యాస్తమయం ఈ పసుపు రాయి కోటను బంగారు వర్ణం లోకి మారుస్తుంది, అందుకే దీనిని సోనార్ ఖిల్లా లేదా బంగారు కోట అని పిలుస్తారు. ఈ కోట కు అఖాయి పోల్, హవా పోల్, సూరజ్ పోల్, గణేష్ పోల్ అనే నాలుగు వేర్వేరు ద్వారాలు వున్నాయి. రాజపుత్ర, ముఘలాయి శైలుల మిశ్రమంలో నిర్మించిన ఈ కోట యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తుంది. యాత్రికులు ఇక్కడ వివిధ రాజ మందిరాలు, ఏడూ జైన దేవాలయాలు, అసంఖ్యాకమైన బావులు చూడవచ్చు. ఈ ఏడు జైన దేవాలయాల్లో శాంతినాద్ దేవాలయం, చంద్రప్రభు దేవాలయం, శీతల్నాద్ దేవాలయం బాగా ప్రసిద్ది పొందాయి.

జైసల్మేర్ కోట సముదాయం లో వున్నా మహారాజ మందిరం లేదా జైసల్మేర్ కోట ప్రాసాద మ్యూజియం, వారసత్వ కేంద్రం కూడా ఈ నగరంలోని ప్రధాన ఆకర్షణలు. ఈ రాజమందిరం పై నుంచి యాత్రికులు నగర విహంగ వీక్షణం చూడవచ్చు. వెండి పట్టాభిషేక సింహాసనం, మంచం, గిన్నెలు, స్థానిక స్టాంప్ లు, బాంక్ నోట్లు, రాజ కుటుంబీకుల శిల్పాలు ఈ మందిరం లోని ప్రధాన ఆకర్షణలు.

జైసల్మేర్ సందర్శించేటప్పుడు ఇక్కడ ప్రసిద్ది పొందిన 180 ఏళ్ళ నాటి అకాల్ వుడ్ ఫాసిల్ పార్క్ ను కూడా చూడాలి. శిలాజీకరణ చెందిన చెట్టు కాండాలు, పురాతన సముద్రపు పెంకులు ఈ పార్క్ లోని ప్రధాన ఆకర్షణ. యాత్రికులు హార్రియర్ లు, బజ్జార్డ్ లు, మచ్చల గద్దలు, పొట్టి కాలి గద్దలు, పెద్ద గద్దలు, రాబందులు, కెస్ట్రెల్ గద్ద, పెద్ద ఫాల్కన్లు, సాండ్ గ్రౌస్ లాంటి పక్షుల జాతులు జైసల్మేర్ లోని ఎడారి జాతీయ పార్క్ లో చూడవచ్చు. ఈ విశిష్టమైన పార్క్ రాజస్థాన్ లో అంతరించి పోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే బట్ట మేక పక్షి కి కూడా సహజ ఆవాసం. ఈ పార్క్ ని నవంబర్ జనవరి నెలల మధ్య సందర్శించడం ఉత్తమం.

నాథ్మల్ జీ కీ హవేలీ, సలీం సింగ్ కీ హవేలీ, పట్వోన్ కీ హవేలీ, హవేలీ శ్రీనాథ్, మానక్ చౌక్, హవేలీ లు తమ విశిష్ట నిర్మాణ శైలికి ప్రఖ్యాతి చెందాయి. జైసల్మేర్ సందర్శించే యాత్రికులు మూల్ సాగర్, గోపా చౌక్, జైసల్మేర్ జానపద మ్యూజియం, తాజియా గోపురం, గడ్సిసార్ సరస్సు, బడా బాగ్, ఖురీ ఇసుక తిన్నెలు, సాం ఇసుక తిన్నెలు, కుల్ధారా కూడా చూడాలి.

జైసల్మేర్ లోని అమర్ సింగ్ సరస్సు ఒడ్డున ఉన్న అందమైన రాజ ప్రాసాదం అమర్ సింగ్ మందిరం.మహారావాల్ అఖాయి సింగ్ అనే రాజు దీన్ని 17వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ గోడలపై వుండే చిత్రాలు దీని అందాన్ని ఇనుమదిమ్పచేస్తాయి. అందమైన ప్రదేశాలతో బాటు జైసల్మేర్ లో కొన్ని మ్యూజియం లో కూడా వున్నాయి. ఎడారి సాంస్కృతిక కేంద్రం మరియు మ్యూజియం లో పురాతన పరికరాలు, అరుదైన శిలాజాలు, ప్రాచీన శాసనాలు, మధ్య యుగం నాటి నాణేలు, సాంప్రదాయ కళాకృతులు వున్నాయి. అలాగే ప్రభుత్వ మ్యూజియం లో కూడా చరిత్ర లో వాడిన ఇంటి సామగ్రి, రాతి వంట సామగ్రి, నగలు చూడవచ్చు.

జైసల్మేర్ చేరుకోవడం :

జైసల్మేర్ వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గానే చేరుకోవచ్చు. జోధ్పూర్ ఈ నగరానికి దగ్గరలోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం విమానాలు తిరుగుతాయి. కోల్కతా, చెన్నై, ముంబై, బెంగళూర్ లకు ఇక్కడి నుంచి ప్రతి రోజు విమాన సర్వీసులు వున్నాయి. జోధ్పూర్ విమానాశ్రయం నుంచి జైసల్మేర్ కు అద్దె టాక్సీలు దొరుకుతాయి. యాత్రికులు ఇక్కడికి రైళ్ళ ద్వారా కూడా చేరుకోవచ్చు. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ నగరానికి, ఇతర ప్రధాన నగరాలకు నిత్యం తిరిగే రైళ్ళు వున్నాయి. జైపూర్, అజ్మీర్, బికానేర్, డిల్లీ ల నుంచి జైసల్మేర్ కు డీలక్స్, సెమీ-డీలక్స్ బస్సులు అందుబాటులో వున్నాయి.

బంగారు నగరం జైసల్మేర్ లో ఏడాది పొడవునా పొడిగా, వేడిగా వుండే వాతావరణం వుంటుంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం ఇక్కడి ప్రధాన ఋతువులు. అక్టోబర్ నుంఛి మార్చ్ మధ్యలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం.

Please Wait while comments are loading...