Search
  • Follow NativePlanet
Share

టోంక్ - కట్టడాలలో చరిత్ర కధలు

22

రాజస్థాన్ లోని టో౦క్ జిల్లాలో బనస్ నది ఒడ్డున వున్న పట్టణం టోంక్. భారత స్వాతంత్ర్యానికి ముందు వరకు రాచరిక రాష్ట్రమైన ఈ పట్టణాన్ని వివిధ రాజవంశాలు పాలించాయి. ఇది జై పూర్ నుండి 95 కి.మీ. దూరంలో ఉంది. టో౦క్ లో చూడవలసిన అద్భుతాలు చాల ఉన్నాయి.టో౦క్ పట్టణం ఈ ప్రాంతం లో గల చారిత్రిక కట్టడాల ద్వారా గత చరిత్ర కు చెందిన కథలను వివరిస్తుంది. ఈ పట్టణం లోను పరిసర ప్రాంతాలలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

ఈ ప్రాంతం లోని సునేహ్రి కోఠీ లేదా బంగారు భవనం ఎక్కువగా సందర్శించబడే పర్యాటక ఆకర్షణ. నవాబ్ మొహమ్మద్ ఇబ్రహీం అలీ ఖాన్ సంగీతం, నాట్యం, కవితాపఠనాల కోసం నిర్మించిన ఈ కట్టడంలో కొన్ని అద్భుతమైన గాజు చిత్రాలు వున్నాయి. నజర్ బాగ్ రోడ్ లో బడా కువా దగ్గరలో గల దీనిని షీష్ మహల్ అని కూడా అంటారు. ఈ భవనం లోని గోడలకు బంగారపు మెరుగులు అద్దారు. ఎనామిల్ అద్దాల వలన ఇక్కడి సభా మందిరాలు అంద౦గా ఉంటాయి.ఈ పట్టణంలో సునేహ్రి కోఠీ తో బాటుగా ఇక్కడి గొప్ప చరిత్ర ను ప్రదర్శించే అనేక చారిత్రిక కట్టడాలు ఉన్నాయి. పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కల్పిత గాథను కల్గి ఉన్న రసియాకి టేక్రి అటువంటి పర్యాటక ఆకర్షణలలో ఒకటి. స్థానికుల ప్రకారం ప్రేమ పాటలు పాడుతూ ఎక్కువ సమయం ఈ ప్రాంతంలో గడిపిన కాయస్థ ప్రేమికుని పేరిట ఈ ప్రాంత౦ ఏర్పడింది.

చారిత్రిక ఘంటాఘర్, జమ మస్జిద్ ఈ ప్రాంతంలో గల కొన్ని ఇతర చారిత్రిక కట్టడాలు. భారత దేశపు అతి పెద్ద మసీదులలో ఒకటైన జామ మసీదును చూడటానికి అనేక మంది భక్తులు టో౦క్ పట్టణానికి వస్తారు. మైసూర్ గార్డెన్స్, హిరణ్ మగరి పార్క్ కు అనుగుణంగా రూపకల్పన చేసిన శివాజీ పార్క్ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం.ఏక శిల నుండి ఏనుగును చెక్కిన కళాకారుని అసాధారణ సృజనాత్మకతకు సాక్ష్యమైన హాథీ భాటాను కూడా పర్యాటకులు సందర్సించవచ్చు. ఈ రెండు ప్రాంతాలు పట్టణ౦ నుండి 30 కి.మీ., 20 కి.మీ.లదూరంలో ఉన్నాయి.

టో౦క్ చేరుకోవడం టో౦క్ లో విమానాశ్రయం గాని రైల్వే స్టేషన్ గాని లేకపోయినప్పటికీ చక్కటి బస్సు సౌకర్యం ఉంది. టో౦క్ నుండి 100 కి.మీ. దూరంలో గల జై పూర్ ఇక్కడికి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం.భారత దేశంలోని అనేక ప్రాంతాలతో బాటుగా విదేశాల నుండి కూడా జైపూర్ కు విమానాలు వున్నాయి. ఇక్కడకు దగ్గరలోని బనస్తలి – నెవై రైల్వే స్టేషన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు కొన్ని రైళ్ళు వున్నాయి.టో౦క్ ను సందర్శించే ప్రజల సౌలభ్యం కోసం అనేక ప్రధాన పట్టణాలు, పొరుగు పట్టణాల నుండి నిరంతర బస్సుసేవలు అందుబాటులో వున్నాయి. రాజస్తాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఇతర ప్రైవేటు సంస్థలకు చెందిన అనేక బస్సులు వివిధ సమీప ప్రాంతాల నుండి కలవు.

టో౦క్ లో వాతావరణం పొడి, వేడి వాతావరణాన్ని కల్గి ఉండే టో౦క్ లో వేసవి, వర్షాకాలం, శీతాకాలం ప్రధానమైన ఋతువులు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉండే కాలం ఈ పట్టణ సందర్శనకు ఉత్తమమైనది. మితమైన ఉష్ణోగ్రత, తక్కువ వర్షాలతో ఉండే వర్షాకాలం కూడా ఈ గొప్ప చారిత్రిక పట్టణాన్ని సందర్శించడానికి అనువైనది.

టో౦క్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

టో౦క్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం టో౦క్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? టో౦క్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: టాంక్ కు పరిసర పట్టణాల నుండి, అనేక ప్రధాన నగరాల నుండి నిరంతర బస్సు సౌకర్యం ఉంది. డిల్లీ, జైపూర్, అజ్మీర్, కోటా, బుండీ మొదలైన ప్రదేశాల నుండి టో౦క్ చేరుకోవడానికి రాజస్తాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్.ఎస్.ఆర్.టి.శి) వారి అనేక బస్సులు కలవు. టో౦క్ కు ఇతర సమీప ప్రాంతాల నుండి కూడా ప్రైవేట్ బస్సులు, టాక్సీలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనస్థలి-నేవాయి టో౦క్ కి సమీప రైల్వే స్టేషన్. టో౦క్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరువాతి సమీప రైల్వే స్టేషన్ అయిన జైపూర్ నుండి దేశంలోని మిగత ప్రాంతాలకు తరచుగా రైళ్ళు ఉన్నాయి. పర్యాటకులు టో౦క్ చేరుకోవడానికి ఏదైనా దగ్గరి రైల్వే స్టేషన్ నుండి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా: పట్టణం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్ టో౦క్ కి సమీప విమానాశ్రయం. దేశంలో అనేక ప్రాంతాల నుండి జైపూర్ విమానాశ్రయానికి అనేక విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. మస్కట్, దుబాయ్, షార్జా వంటి వివిధ విదేశీ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుండి అనేక విమానాలు కలవు. జైపూర్ విమానాశ్రయం నుండి టో౦క్ పట్టణం చేరుకోవడానికి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun