Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » టో౦క్ » వాతావరణం

టో౦క్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలం ఈ చారిత్రిక నగర సందర్శనకు అనువైనదిగా భావించినప్పటికీ వర్షాకాలం లో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించ వచ్చు. 

వేసవి

వాతావరణం టో౦క్ తీవ్రమైన వేసవి, మధ్యస్థమైన చల్లని శీతాకాలాలతో కూడిన వేడిశుష్క వాతావరణాన్ని కలిగిఉంటుంది. వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): టో౦క్ లో వేసవికాలం మార్చ్ నెలలో మొదలై జూన్ వరకు ఉంటుంది. 26 డిగ్రీల నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో పొడి వాతావరణం కలిగిఉంటుంది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత 30c ఉంటుంది. తీవ్రమైన వేడిని కలిగిఉండే ఈ కాలం పర్యటనకు సరైనది కాదు. వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): వర్షాకాలం ఆరంభం నుండి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి.

వర్షాకాలం

వర్షాకాలం జులై లో మొదలై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ధార్ ఎడారిలో ఉన్నందు వల్ల టో౦క్ లో వర్షాలు తక్కువగా ఉంటాయి. అయితే, సంవత్సరంలో ఈ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు): టో౦క్ లో శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. వాతావరణం మధ్యస్థ౦గా ఉండటం వల్ల పర్యాటకులు ఈ కాలంలో ఎక్కువగా ఇక్కడకు వస్తారు. ఈ సమయంలో ఉష్ణోగ్రత 15c నుండి 22c. మధ్య ఉంటుంది.