Search
 • Follow NativePlanet
Share

అభనేరి - దిగుడు బావులకు ప్రసిద్ధి

11

అభనేరి రాజస్ధాన్ లోని దౌసా జిల్లాలో జైపూర్ - ఆగ్రా రోడ్డు పై జైపూర్ కు 95 కి.మీ.ల దూరంలో కల ఒక గ్రామం. ఇక్కడ చాంద్ బవోరి అనే ఒక పెద్ద మెట్ల బావి తో ఈ ప్రదేశం బాగా ప్రసిద్ధి గాంచినది. ఇండియాలోని మెట్లబావులన్నింటికంటే కూడా ఈ మెట్లబావి ఎంతో అందమైనది. అభనేరి గ్రామాన్ని గుర్జార్ ప్రతిహార్ రాజు సామ్రాట్ మిహిర్ భోజ్ స్ధాపించినట్లు తెలుస్తోంది.

ఈ గ్రామాన్ని మొదట్లో అభ నగరి అని పిలిచేవారు. అభా నగరి అంటే వెలుగుల నగరం అని అర్ధం చెపుతారు. అయితే, కాలక్రమేణా నఈ పేరు సరిగా పలకకపోవటంతో ఇపుడు అభనేరిగా పిలువబడుతోంది. ఒకప్పుడు వెలుగుల నగరంగా పిలువబడిన అభనేరి నేడు శిధిలావస్ధలో ఉంది. అయినప్పటికి చిన్నదైన ఈ గ్రామం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

అభనేరి మెట్ల బావులు లేదా దిగుడు బావులకు ప్రసిద్ధి. వీటిలో వర్షపు నీరు వేసవి ఉపయోగార్ధం నిలువ చేసుకుంటారు. ఇక్కడ కల దిగుడు బావులన్నింటిలోను చాంద్ బవోరి చాలా ప్రసిద్ధి చెందినది. అందమైన శిల్ప శైలి కూడా కలిగి ఉంది. ఇండియాలోనే ఇది అతి పెద్దది మరియు లోతైన దిగుడు బావి. మధ్య యుగం నాటి భారతదేశ శిల్ప సంపదలో కల హర్షత్ మెహతా దేవాలయం కూడా పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. ఈ దేవాలయంలో దేవత హర్షత్ మెహతా. ఈ దేవత సంతోష ఆనందాల దేవతగా చెపుతారు.

జానపద నృత్యాల గ్రామం

అభనేరి గ్రామం జానపదుల నృత్యాలకు ప్రసిద్ధి గాంచింది. ఘూమర్, కలబెలియా, భవాయ్, వంటివి ప్రసిద్ధి చెందిన నాట్యాలు. ఘూమర్ డ్యాన్స్ ను భిల్ తెగ వారు కలబెలియా డ్యాన్సును పాములు పట్టి వాటి విషాలను విక్రయించే కలబెలియా తెగలోని మహిళలు, చేస్తారు. భవాయ్ డ్యాన్స్ ను అంబామాత లేదా భూ దేవి కొరకు ఒక మతపర వేడుకగా చేస్తారు. అభనేరి ఎలా చేరాలి?

జైపూర్ నగరం నుండి సుమారు 95 కి.మీ. ల దూరంలోనే కనుక అభనేరి గ్రామాన్ని ఇండియాలో ఎక్కడి నుండైనా సరే తేలికగా చేరవచ్చు. ఈ గ్రామానికి గల సంస్కృతి పరంగా పర్యాటకులు అధిక సంఖ్యలో ప్రపంచంలోని నలుమూలలనుండి ఇక్కడకు వస్తారు.

అభనేరి సందర్శనకు ఉత్తమ సమయం

అభనేరి సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదంగాను సౌకర్యవంతంగాను ఉంటుంది. ఆకర్షణలు

చాంద్ బవోరి

చాంద్ బవోరి రాజస్ధాన్ లోని అభనేరిలో కలదు. ఇండియాలోని దిగుడు బావులలో కెల్లా అందమైన బావి ఇది. ఈ మెట్ల బావిని 9వ శతాబ్దంలో ఈ ప్రాంతపు రాజు రాజా చంద్ నిర్మించారు. ఈ మెట్లబావులు పురాతన కాలంలో వర్షాల నీటితో నిండి, నీరు అవసరమైన వేసవి కాలంలో వాడుకునేందుకు రిజర్వాయర్లుగా ఉపయోగపడేవి. నలుచదరంగా నిర్మించిన ఈ మెట్ల బావి లోతు సుమారు 100 అడుగులుంటుంది. దీనికి ఇరుకైన 3,500 మెట్లు 13 అంతస్తులలో నిర్మించారు. ఈ బావికి మూడు వైపులనుండి మెట్లు కలవు. నాలుగవ వైపు ఒకదానిపై మరొకటిగా మంటపాలను నిర్మించారు. ఈ మంటపాలలో అందమైన శిల్పాలు, చెక్కడాలు నిర్మించారు. ఇక్కడే ఒక స్టేజి మరియు కొన్ని గదులు కూడా కలదు. దీనిలో రాజు మరియు రాణి తమ కళలను ప్రదర్శించేవారు.

చాంద్ బవోరిని ప్రస్తుతం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించేందుకు ఎటుంవంటి ప్రవేశ రుసుము లేదు. ఈ ప్రదేశాన్ని కొన్ని సినిమాలలో అంటే "ది ఫాల్" మరియు "ది డార్క్ నైట్ రైసెస్" వంటి చిత్రాలలో షూటింగ్ లలో వాడారు. హర్షత్ మాతా దేవాలయం

రాజస్ధాన్ లోని అభనేరి గ్రామంలోని చాంద్ బవోరి ఎదురుగా హర్షత్ మాత దేవాలయం కలదు. ఈ దేవాలయాన్ని 8వ లేదా 9వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం మాత హర్షత్ మాత దేవత కొరకు నిర్మించారు. ఈమె సంతోష ఆనందాలను కలిగిస్తుందని విశ్వసిస్తారు. భక్తులు ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి ఎడతెగని సంతోషానందాలను పొందుతారు. ప్రతి సంవత్సరం హర్షత్ మాత దేవాలయంలో మూడు రోజులపాటు జాతర నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పొరుగు గ్రామాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. చక్కని శిల్పకళకు ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం ఇపుడు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నిర్వహణలో కలదు.

 

 

అభనేరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అభనేరి వాతావరణం

అభనేరి
35oC / 96oF
 • Sunny
 • Wind: W 21 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం అభనేరి

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? అభనేరి

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ప్రయాణం అభనేరి జాతీయ రహదారి 11 పై ఉండి ఆగ్రా, జైపూర్, అకు తేలికగా ప్రయాణించేలాగుంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం దౌసా రైలు స్టేషన్ 35 కి. మీ. ల దూరంలో సమీపంగా కలదు. 95 కి.మీ.ల దూరంలో కల జరైపూర్ రైల్వే స్టేషన్ సమీప రైలు స్టేషన్. ఇక్కడనుండి ఇండియాలోని అన్ని పట్టణాలకు తేలికగా చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  అభనేరి గ్రామాన్ని విమానం, రైలు లేదా రోడ్డు ప్రయాణాలలో చేరవచ్చు. విమాన ప్రయాణం అభనేరికి సుమారు 95 కి.మీ. ల దూరంలో కల సంగనేర్ విమానాశ్రయం జైపూర్ పట్టణంలో కలదు. ఈ విమానాశ్రయం నుండి అభనేరికి టాక్సీలు, క్యాబ్ లు లభిస్తాయి. ఈ విమానాశ్రయం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరియు ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించబడింది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Nov,Wed
Return On
26 Nov,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
25 Nov,Wed
Check Out
26 Nov,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
25 Nov,Wed
Return On
26 Nov,Thu
 • Today
  Abhaneri
  35 OC
  96 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Abhaneri
  33 OC
  91 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Abhaneri
  33 OC
  92 OF
  UV Index: 9
  Sunny