Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అభనేరి » వాతావరణం

అభనేరి వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయంఅభనేరి సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి సహకరిస్తుంది. అయితే, వర్షాలలో బయట తిరిగి ఆనందించాలనుకునేవారికి జూన్ నుండి సెప్టెంబర్ వరకు కూడా సౌకర్యమే.

వేసవి

వాతావరణంఅభనేరిలో అన్ని కాలాల వాతావరణం ఒక మోస్తరుగా అంటే వేసవిలో వేడి, వర్షాకాలాలు, ఆహ్లాదంగా, శీతాకాలం చలిగాను ఉంటుంది.వేసవి (ఏప్రిల్ నుండి జూన్) వేసవి వేడా తీవ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు రోజులో 26 డిగ్రీ సెంటీ గ్రేడ్ నుండి 45 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు మారుతూంటాయి. మే నెల అధిక వేడి కలిగి ఉంటుంది కనుక పర్యాటకులు ఈ సమయంలో సందర్శనకు ఇష్టపడరు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్)జూన్ నెలలో చెదురుమదురుగాను తర్వాతి మూడు నెలలలోను విపరీతంగాను పడే వర్షాలు, వేసవి వేడిని తగ్గిస్తాయి. ఆగస్టు నెలలో వర్షాలు అధికం. ప్రదేశ అందాలు రెట్టింపుగా ఉండి పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి)శీతాకాలంలో ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీ సెల్షియస్ నుండి కనిష్టంగా 8.3 డిగ్రీలవరకు కూడా చేరతాయి. పర్యటనకు ఇది మంచి సమయంగా భావించవచ్చు.