ఫలోదీ లోని ఖికన్ఫలోదీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వున్న గ్రామం ఖికన్. డేమాయిసేల్లె కొంగలకు తాత్కాలిక ఆవాసమైన పక్షుల కేంద్రానికి ఈ గ్రామం ప్రసిద్ది చెందింది. ఈ పక్షులు శీతాకాలంలో యూరప్ నైరుతి భాగం నుంచి, ఉక్రెయిన్, పోలాండ్ ల నుంచి ఇక్కడికి ఎగురుకుంటూ వస్తాయి.ఈ పక్షులను స్థానికంగా ‘కుర్జా’ లని పిలుస్తారు.
ఆగస్ట్ నుంచి మార్చ్ మధ్య పర్యాటకులు కనీసం 9000 డేమాయిసేల్లె కొనగలను ఇక్కడ చూడవచ్చు. ఈ పక్షులకు తాత్కాలిక ఆవాసంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందడం వల్ల ఈ గ్రామాన్ని ‘డేమాయిసేల్లె కొంగల గ్రామం’గా పిలుస్తారు.ఫలోదీ లోని లాల్ నివాస్ లాల్ నివాస్, ఫలోదీ లోని అందమైన హవేలీ. ఈ భవనాన్ని అందమైన రూపాన్ని అందించే ఎరుపు ఇసుకరాయితో నిర్మించారు.
ఈ రాజభవనం 1750 లో నిర్మించబడింది. ప్రస్తుతం, ఈ ప్రాంతం ప్రసిద్ధ హెరిటేజ్ హోటళ్ళ లో ఒకటిగా ఉంది. ఇక్కడ గాజు పనితో అలంకరించబడిన అందమైన షా౦డిలేయర్ లు, గోడలపై ఉన్న ఆకర్షణీయమైన కళాకృతులు చూడవచ్చు. ఫలోదీ లోని రామ్ దేవరా ఆలయం రామ్ దేవరా ఆలయం, ఫలోదీ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహానికి ప్రసిద్ది.