పుష్కర్ ప్రపంచ ప్రసిద్ధ పశువుల సంతకు ప్రసిద్ది. ప్రతి ఏడాది నవంబర్ మాసంలో కార్తిక పౌర్ణమి నాడు ఈ పశువుల సంత జరుగుతుంది. ఈ ఉత్సవ సమయంలో లక్షల కొద్ది భక్తులు పుష్కర్ సరస్సులో పవిత్ర స్నానమాచరించడానికి ఇక్కడకు వస్తారు. పెంపుడు జంతువుల క్రయ విక్రయాలు, ప్రధానంగా ఒంటెలు ఈ సంతలో ఒక పెద్ద ఆకర్షణ. ఈ ఉత్సవంలో తోలు బొమ్మలాటలు, ఒంటెల పందాలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.