సరిస్క నేషనల్ పార్క్, సరిస్క

హోమ్ » ప్రదేశములు » సరిస్క » ఆకర్షణలు » సరిస్క నేషనల్ పార్క్

రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా లో ఢిల్లీ – ఆల్వార్ – జై పూర్ మార్గంలో ఉండే సరిస్క నేషనల్ పార్క్ ను సరిస్క టైగర్ రిజర్వు అని కూడ అంటారు.మునుపటి ఆల్వార్ రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని వేట విడిదిగా ఉపయోగించే వారు, తర్వాత 1955 లో వన్య ప్రాణి అభయారణ్యంగా ప్రకటించ బడిన ఈ ప్రాంతం 1979 లో నేషనల్ పార్క్ హోదా ను పొందింది. ఈ నేషనల్ పార్క్ రమణీయ ఆరావళి కొండలలో 800 చ. కి.మీ. వైశాల్యం మేర విస్తరించి ఉంది. ఇది గడ్డి భూములు, పొడి ఆకురాల్చు అడవులు, పరిపూర్ణ శిఖరాలు, రాళ్ళతో నిండిన ప్రకృతి దృశ్యాల వంటి విభిన్న భూభాగాలను కల్గి ఉంది. ఈ ప్రాంతపు ప్రధాన భాగం డోక్ వృక్షాలతో నిండి అనేక వన్య ప్రాణి జాతులకు ఆశ్రయమిస్తుంది.సరిస్క నేషనల్ పార్క్ విభిన్న వన్య మృగాలైన చిరుతపులులు, సాంబార్లు, జింకలు, నిల్గై లు, నాలుగు కొమ్ముల దుప్పులు, అడవి పందులు, రీసస్ మకాక్స్, లంగూర్లు, హైనాలు, అడవి పిల్లుల వంటి వాటికి పుట్టిల్లు. చాలా రకాలా మగ కోళ్ళు, సాండ్ గ్రౌస్లు, బంగారు వన్నె ముక్కు గల వడ్రంగి పిట్టలు, పించం గల సర్ప గద్ద మొదలైనవి ఈ నేషనల్ పార్క్ లో చూడవచ్చు. 10 వ శతాబ్దం, 11వ శతాబ్డంలోని మధ్యయుగానికి చెందిన ఘర్ – రాజోర్ దేవాలయాల శిధిలాలను కూడ ఈ పార్క్ లో చూడవచ్చు.సరిస్క నేషనల్ పార్క్ లో కొండ పైన వున్న 17 వ శతాబ్దానికి చెందిన ఒక కోట వద్ద ఎగిరుతున్న రాబందులు, గ్రద్దల దృశ్యం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ టైగర్ రిజర్వు ఇతర మాంసాహారులైన చిరుతపులులు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, హైనాలు, నక్కలను కూడ భారీ సంఖ్యలో కల్గి ఉంది.

Please Wait while comments are loading...