అజబ్ ఘడ్ కోట, సరిస్క

సరిస్క కు అతి సమీపంలో, భాన్ గర్, ప్రతాప్ ఘడ్ కోటలకు మధ్యలో వున్న అజబ్ ఘడ్ కోట రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలోని ఒక ఆకర్షణ. ఈ కోట భాన్ గర్ కోట, పట్టణం చరిత్ర, ఇతిహసాలతో దగ్గరి సంబంధం కల్గి ఉంది. మాదో సింగ్ మనమడు అజబ్ సింగ్ రాజవత్ నిర్మించిన ఈ కోట తన మనోహరమైన అందానికి ప్రసిద్ది చెందింది. అజబ్ ఘడ్ పట్టణం దాని చుట్టుపక్కప్రాంతాలు ఈ కోట నుండి స్పష్టంగా కనబడతాయి.

Please Wait while comments are loading...