జంగిల్ సఫారి, సరిస్క

పార్క్ లో భారి సంఖ్యలో వన్య మృగాలతో బాటుగా అరుదైన వృక్ష జంతు సంపద ఉండటం వలన సరిస్క నేషనల్ పార్క్ లో జంగిల్ సఫారి ఎంతో ఉత్కంఠను, ఆనందాన్ని కల్గిస్తుంది.నడక, పర్వతారోహణ, జీప్ ద్వారా సరిస్క లో జంగిల్ సఫారీ చేస్తూ అనేక ప్రాంతాలు చూడవచ్చు.టైగర్ రిజర్వు గా ప్రసిద్ది చెంది నప్పటికీ సరిస్క నేషనల్ పార్క్ నందు ఇతర వన్యప్రాణులైన సాంబార్, జింక, అడవి పంది, కుందేలు, నిల్గై, పునుగు పిల్లి , నాలుగు కొమ్ముల యాంటి లోప్ , గౌర్ (ఇండియన్ ఆంబోతు ), పందికొక్కు లను చూడవచ్చు. ఇక్కడ కనబడే రకరకాల పక్షులలో మగ కోళ్ళు, బూడిద రంగు చిలుకలు, ట్రీ ఫై లు, బంగారు వన్నె ముక్కు గల వడ్రంగి పిట్టలు లాంటి పక్షులను పర్యాటకులు చూడవచ్చు.

Please Wait while comments are loading...