ఇండియాగేట్, ఢిల్లీ

ఢిల్లీ లో గల పర్యాటక ప్రదేశాలన్నింటిలో “ఇండీయా గేట్” ప్రముఖమైనది. ఢిల్లీ నగరం నడిబొడ్డున గల 42 అడుగుల ఇండియాగేట్ ఇతర స్థూపాల కంటే ఎత్తులో ఠీవీ గా నిలబడీ ఉంటుంది. ఈ  స్థూపాన్ని పారిస్ లో గల “ఆర్చ్-డీ-ట్రయంఫ్” ని పోలిఉండేటట్లు నిర్మించారు. “ఆల్ ఇండియా వార్ మెమోరియల్” గా మొదట పిలవబడ్డ ఈ కట్టడం మొదటీ ప్రపంచ యుద్ధ కాలం లో మరియు 1919 లో మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధాలలో  ఆంగ్లేయుల తరపున పోరాడుతూ అసువులు బాసిన 70 వేలమంది సైనికుల జ్ఞాపకార్ధం నిర్మించబడినది.

దీనికి మొదట 1921 లో  శంఖుస్థాపనని చేసినది కానాట్ డ్యూక్ అయినా, 1931 లో వైస్రాయ్ లార్డ్  ఇర్విన్  పూర్తి చేసారు. డీని డిజైన్ రూపకర్త ఎడ్వర్డ్ లుట్యెన్స్. ఏరుపు మరియు లేత రంగు ఇసుక రాళ్ళు, గ్రానైట్ తో ఇండియా గేటు  ని నిర్మించారు. ఈ  కట్టడం కింద  1971 ఇండో పాక్ యుద్ధం లో అమరులైన సైనికుల గౌరవార్ధం  నిరంతరం వెల్గుతుండే “అమర జవాన్ జ్యోతి” ని చూడవచ్చు.

 ఇండీయా గేటు  ముందు గల ఖాళీ మంటపం లో ఇంతకుముందు భారత దేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయుడు  ఐదవ జార్జ్ విగ్రహం ఉండేది.కానీ దీనిని తరువాత కోరోనేషన్ పార్కు కి తరలించారు. ఇండీయా గేటు  1931 లో నిర్మించబడ్డా కానీ ఇప్పటికీ ప్రముఖ దర్శనీయ స్థలం గా గుర్తించబడుతోంది.

Please Wait while comments are loading...