Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » రాజ్ ఘాట్

రాజ్ ఘాట్, ఢిల్లీ

4

ఢిల్లీ లోని రాజ్ ఘాట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇది మహాత్మా గాంధీ దహన స్థలం. 1949 జనవరి 31 న జరిగిన అతని హత్య తరువాత నిర్మించబడింది. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదంటే భారత దేశ సందర్శన కి వచ్చిన విదేశీ ప్రతినిధులు అందరూ రాజ్ ఘాట్ కి వచ్చి పుష్పాంజలి ఘటించి మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించడం పరిపాటి గా మారింది.

రాజ్ ఘాట్ యమునా నదీ తీరం లోని మహాత్మా గాంధీ మార్గ్ లో ఉంది. ఢిల్లీ లోని ఈ అత్యంత ప్రజాకర్షక ప్రదేశం ప్రతి రోజూ కొన్ని వేల మంది యాత్రికులను ఇక్కడికి రప్పిస్తుంది. నల్ల రాతి తో నిర్మించబడిన చదరపు ఆకార వేదిక ఈ స్మారకం. ఒక వైపు శాశ్వత జ్వాల వెలుగుతూ ఉంటుంది. దీని చుట్టూ కాలి రాతి తోవ మరియు పచ్చని మైదానం ఉన్నాయి. మహాత్ముని చే పలుకబడిన ఆఖరి మాటలు గా భావించబడే “ హే రాం” అనే అక్షరాలు స్మృతి లేఖనంపై రాయబడి ఉన్నాయి.

ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించినప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. గాంధీజీ కి మర్యాదపూర్వకంగా, రాజ్ ఘాట్ సందర్శకులు ప్రాంగణంలో ప్రవేశించే ముందు వారి పాదరక్షలు తీసివేయాలి. ప్రతి శుక్రవారం స్మారక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ మహా నాయకుని జయంతి వర్ధంతి రోజులలో ప్రార్థనా సమావేశాలు జరుగుతాయి.

వాను జి భుట చే రూపొందించబడిన ఈ స్మారక చిహ్నం యొక్క నిర్మాణ శైలి ఆ గొప్ప నాయకుని “నిరాడంబరత” మంత్రాన్ని గుర్తుకు తెస్తుంది. అయితే, నిర్మించబడిన తర్వాత దీని రూపం లో చాలా మార్పులు జరిగాయి.

రాజ్ ఘాట్ కు వెళితే మీరు కేవలం మహాత్ముని స్మారక ప్రదేశాన్ని మాత్రమే చూడరు. ఈ సుప్రసిద్ధ దహన స్థలి చుట్టూ భారత దేశాన్ని పరిపాలించిన వివిధ ఇతర ముఖ్య రాజకీయ నాయకుల స్మారక ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని- జవహర్ లాల్ నెహ్రూ స్మారక ప్రదేశం శాంతి వన్, లాల్ బహదూర్ శాస్త్రి స్మారక ప్రదేశం విజయ్ ఘాట్, ఇందిరా గాంధీ దహన ప్రదేశం శక్తి స్థల్, జ్ఞాని జైల్ సింగ్ స్మారక ప్రదేశం ఏక్తా స్థల్, రాజీవ్ గాంధీ యొక్క దహన ప్రదేశం వీర్ భూమి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed