పార్లమెంట్ హౌస్, ఢిల్లీ

హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » పార్లమెంట్ హౌస్

దేశం యొక్క అత్యున్నత చట్ట సభ - పార్లమెంట్ హౌస్ – కొత్త ఢిల్లీ లోని ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.సంసద్ మార్గ్ లోని ఈ ఆకర్షణీయమైన వలయాకార నిర్మాణం లో మంత్రివర్గ కార్యాలయాలు, వివిధ సంఘాల గదులు, విస్తృతమైన గ్రంథ సేకరణ తో కూడిన అందమైన గ్రంథాలయం కొలువై ఉన్నాయి.

ఈ వృత్తాకార భవనం లో పైన గోపురం కలిగిన ఒక సెంట్రల్ హాల్ (కేంద్ర మందిరం) ఉన్నది. సామ్రాజ్య శైలి లో కట్టబడిన ఈ భవనం లోని 144 స్తంబాల తో కూడిన వరండా ఉన్నది. సర్ ఎడ్విన్ లుట్యెన్స్ మరియు సర్ హెర్బర్ట్ బేకర్ అనే ఇద్దరు బ్రిటీష్ భవనశిల్పులు రూపొందించిన దీని నిర్మాణం1927 లో ముగిసింది. 1946 వరకు అప్పటి కేంద్ర శాసన సభ యొక్క కేంద్ర గ్రంథాలయం గా పనిచేసింది. తరువాత రాజ్యాంగ సభా మందిరం గా మార్చబడినది. రెండు కారణాలచేత సెంట్రల్ హాల్ భారతీయ చరిత్ర లో ముఖ్య స్థానాన్ని పొందింది –వలస రాజ్య అధికారాన్ని నెహ్రు ఆధ్వర్యం లోని తాత్కాలిక ప్రభుత్వానికి బదిలీ మరియు రాజ్యాంగ రూపకల్పన.

ఈనాడు, సెంట్రల్ హాల్ లోక్ సభ రాజ్య సభ సమావేశాలకి మరియు సభ్యుల మధ్య చర్చలకి, ఇంకా ఇతర ముఖ్య రాజకీయ సందర్భాలకి ఉపయోగించబడుతుంది.

సందర్శకులకి భవనం సందర్శించడానికి అనుమతి లేదు. అయితే, ముందస్తు అనుమతితో, హౌస్ లోపలి వ్యవహారాలను వీక్షించవచ్చు.

Please Wait while comments are loading...