Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరౌలి » వాతావరణం

కరౌలి వాతావరణం

కరౌలి సందర్శనకు సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం ఫిబ్రవరి నెలలో పశువుల సంత మరియు కైలా దేవి జాతర మార్చి - ఏప్రిల్ లో జరుగుతాయి కనుక ఈ సమయాలు పర్యటనకు సూచించదగినవి.

వేసవి

వాతావరణం వేసవి ( ఏప్రిల్ నుండి మే) వేసవి అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీలు గాను కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగాను ఉంటుంది. మే నెల అత్యధిక వేడి కలిగి ఉంటుంది. కనుక పర్యాటకులు ఈ సమయాన్ని తప్పిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) జూన్ లో మొదలైన వర్సాకాలం సెప్టెంబర్ నెల చివరి వరకు కొనసాగుతుంది. వర్షాలు ఈ ప్రాంతంలో ఒక మోస్తరుగా పడతాయి.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) కరౌలిలో శీతాకాలం చల్లగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా 8 డిగ్రీలు గరిష్టం 28 డిగ్రీ సెంటీ గ్రేడుగా ఉంటుంది. కొన్ని మార్లు కనిష్టం 4 డిగ్రీలకు కూడా పడిపోతుంది. శీతాకాలం పర్యటనకు అనువైనది.