Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సవాయి మాధో పూర్ » వాతావరణం

సవాయి మాధో పూర్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం : సవాయి మాధో పూర్ నగరాన్ని సందర్శించడానికి శీతాకాలం ఉత్తమమైనది. ఈ కాలం లో వాతావరణం, చాల ఆహ్లాదంగా, చల్లగా ఉంటుంది. చాల మంది పర్యాటకులు ఈ నగరాన్ని అక్టోబర్ నుండి ఏప్రిల్ నెలల మధ్య సందర్శిస్తారు.

వేసవి

వాతావరణం సవాయి మాధో పూర్ వేడిగ , పొడిగా వుండే వేసవికాలం, తేమతో కూడిన ఆర్ద్ర వర్షాకాలన్ని కల్గిన ఉప ఉష్ణ మండల వాతావరణాన్ని కల్గి ఉంటుంది. శీత కాలాలు చల్లగా, ఆహ్లాదకర౦గా ఉంటాయి.వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్ ): ఈ నగరంలో సంవత్సరం మొత్తంమీద మే నెలలో తీవ్రమైన వేడిని కల్గి, వేసవి కాలం వేడిగా ఉంటుంది. మార్చ్ నెల చివరకు మొదలైన వేసవి కాలం జూన్ నెల చివర వరకు ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే నెలలలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 45 డిగ్రీలుగా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్ ) : సవాయి మాధోపూర్ నందు కొంత వేడిమి, అధిక ఆర్ద్రత తో కూడిన వర్షాకాలం ఉంటుంది. జూన్ నెల ప్రారంభం నుండి మొదలైన వర్షాలు సెప్టెంబర్ నెల మధ్య వరకు ఉంటాయి. ఈ పట్టణంలో కొద్ది తుఫానులతో కూడిన చిన్న చిన్న వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) : సవాయి మాధో పూర్ నందు శీతాకాలం చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది.ఇది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. మధ్యస్థమైన పగటి ఉష్ణోగ్రతతో గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు ఉండగా, రాత్రి వేళలలో మరింత చలితో కూడిన 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదౌతుంది.