Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » వాతావరణం

ఉదయపూర్ వాతావరణం

ప్రయాణానికి అనువైన సమయం: సంవత్సరంలో సెప్టెంబర్, మార్చ్ మధ్య అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆ సమయంలో ఉదయపూర్ సందర్శించడం అనువైనది. 

వేసవి

వాతావరణం ఉదయపూర్ లో వాతావరణం సంవత్సరంలో ఎక్కువ భాగం వేడిగా, పొడిగా ఉంటుంది. వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): వేసవి కాలం మార్చ్ నేలతో ప్రారంభమై జూన్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో అక్కడి వాతావరణం చాలా వేడిగా, అసౌకర్యంగా ఉంటుంది. అక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 45c, 23c గా నమోదై ఉంటాయి. 

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): ఉదయపూర్ లో జులై నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్నపుడు, వాతావరణం తేమగా ఉండి ఆహ్లాదకరంగా ఉండదు. 

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు): ఉదయపూర్ లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి తో ముగుస్తుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటంవల్ల ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి ఇది అనువైన సమయం. ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 28c, 3c గా నమోదై ఉంటాయి.