Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » సిటి ప్యాలెస్

సిటి ప్యాలెస్, ఉదయపూర్

4

ఉదయపూర్ లోని సిటీ పేలస్ఉదయపూర్ లోని సిటీ పాలెస్ నగరంలో అన్నిటికన్నా అందమైన భవంతి. రాజస్తాన్ లో అలంటి భవంతుల్లో కల్లా ఇదే పెద్దదని భావిస్తారు. ఈ ప్రసాదాన్ని 1559 లో సిసోడియా రాజపుత్రుల రాజధానిగా మహారాణా ఉదయమీర్జాసింగ్ నిర్మించాడు. ఇది పిచోల సరస్సు ఒడ్డున ఉంది. సిటీ పేలస్ సముదాయంలో సుమారు 11 భవంతులు ఉన్నాయి. ఈ భవన నిర్మాణ౦ మొఘలాయీ, రాజస్థానీ శైలుల మిశ్రమంగా ఉంటుంది. కొండపైన నిర్మించిన ఈ భవంతి మొత్తం నగరాన్నీ విహంగ వీక్షణంగా చూపుతుంది.

ఇక్కడ ఉన్న వివిధ గోపురాలూ, మంటపాలూ, పెరళ్ళూ, గదులూ, స్తంభాలూ, ఊగే ఉద్యానవనాలూ దీని శోభను ఇనుమడింప చేస్తాయి. ఈ భవంతికి చాలా ద్వారాలు ఉన్నాయి. బారాపోల్ లేదా మహాద్వారం ఈ భవంతికి ప్రధాన ముఖద్వారం. మూడు తోరణాలు ఉన్న త్రిపోలియా అనే ద్వారం కూడా ఉంది. దీనికి దగ్గరలోనే ఉన్న మైదానంలో ఏనుగుల యుద్ధాలు జరిగేవి. ఈ రెండు గేట్లకీ మధ్యలో ఎనిమిది తోరనాలూ లేదా పాలరాతి ఆర్చీలు ఉండేవి. ఇక్కడ రాజులను వెండి, బంగారాలతో తులాభారం తూచి తరువాత అదంతా పేదలకు పంచేవారు.

ఈ భవంతి లోపలి అందాన్ని పాత ఫర్నిచరు, అందమైన చిత్రాలూ, మంచి అద్దాలూ, అలంకరించిన టైల్సు ద్విగునీక్రుతం చేస్తాయి. ఇక్కడి మానక్ మహల్ లేదా రూబీ పాలెస్ అద్భుతమైన స్ఫటిక, పింగాణీ విగ్రహాలతో అలంకరించబడి ఉంటుంది. రాధాకృష్ణుల జీవితాలను చిత్రించిన సూక్ష్మ చిత్రాలతో భీమ విలాస్ అలంకరించబడి ఉంటుంది. కృష్ణ విలాస్, సీష్ మహల్ లేదా అద్దాల మహల్, మోతీ మహల్ లేదా ముత్యాల మందిరం, సిటీ పాలెస్ లోని ఇతర ప్రధాన భవంతులు. ఉదయపూర్ లోనే పెద్ద క్షేత్రంగా భావించే జగదీశ్ దేవాలయం ఈ సిటీ పాలెస్ సముదాయంలో భాగమే.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jul,Sat
Check Out
12 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun