Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మౌంట్ అబు » వాతావరణం

మౌంట్ అబు వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం : మౌంట్ అబూ లో సంవత్సరం పొడవున ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.వేసవి కాలం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది. భారతదేశ౦లొని వేసవి ఎండల నుండి తప్పించుకోవడానికి పర్యటకులు మౌంట్ అబూకు తరలి వస్తారు.

వేసవి

వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్ ): వేసవి కాలం లో మౌంట్ అబూ నందు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మిగిలిన రాజస్థాన్ ప్రాంతంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరినప్పటికి, సరాసరి ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుండి 21 డిగ్రీల మధ్య ఉంటాయి. వేసవి కాలం లో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు వదులైన, తేలికపాటి కాటన్ దుస్తులతో రావడం మంచిది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్): ఎడారి మధ్యలో ఉన్నప్పటికీ మౌంట్ అబూ నందు చక్కటి వర్షాలు కురుస్తాయి. 25 డిగ్రీలు18 డిగ్రీల గరిష్ట కనిష్ట సరాసరి ఉష్ణోగ్రతలతో వాతావరణం చల్లగా ఉంటుంది. ప్రతి నెల వర్షపాతం 550 మీ.మీ. నుండి 600 మీ.మీ.ల మద్య ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) : శీతాకాలం లో మౌంట్ అబూ చాల చల్లగా ఉంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య గల నెలలలో ఉష్ణోగ్రత 12 డిగ్రీల నుండి 29 డిగ్రీల మధ్య ఉంటుంది. రాత్రి వేళల్లో వాతావరణం మరింత చల్లగా ఉండి ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువ స్థాయికి పడిపోతుంది.