మల్షేజ్ ఘాట్ లో వున్న హరిశ్చంద్ర గడ కోట 6వ శతాబ్దానికి చెందిన చారిత్రిక కట్టడం. 1424 మీటర్ల ఎత్తున వుండే ఈ కోట సాహసికులు మనసుపడే పర్వతారోహణ ప్రదేశం. ఈ అద్భుతమైన కోట ఎక్కడం ప్రక్రుతి ప్రేమికులకు, సాహస ప్రియులకు సవాల్‌లా వుంటుంది.హరిశ్చంద్ర గడ శిఖరం ఇక్కడికి దగ్గరలోని మరో ప్రధాన ఆకర్షణ. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడి నుంచి ఒక నాణెం క్రిందికి వదలితే, అర్ధ చంద్రాకారంలో వుండే ఈ రాతి ఆకారం వల్ల ఆ నాణెం గురుత్వాకర్షణ శక్తిని కాదని, క్రింద వుండే వాతావరణ ఒత్తిడి వల్ల పైకి ఎగరడం మీరు గమనిస్తారు.ఈ కోటను కాలచూరి రాజులు నిర్మించారని విశ్వసిస్తారు. ఈ కోట ఆవరణలో అందమైన విష్ణువు దేవాలయం వుంది. ఇక్కడికి దగ్గరలో వున్న పురాతన బౌద్ధ గుహలు మరో ప్రధాన ఆకర్షణ.