పుర్వార్ మ్యూజియం ఔరంగాబాద్ లో ప్రసిద్ధి చెందినది. ఇది సరాఫా రోడ్డులోని ఒక చిన్న మ్యూజియం. దీనిలో డాక్టర్ పూర్వార్ వ్యక్తిగత అంశాలు ఎన్నో ప్రదర్శిస్తారు. ఇక్కడి వస్తువులు ఆయనచే సేకరించబడినవి.
500 సంవత్సరాల నాటి గొలుసుకల ఒక సూటు, ఔరంగజేబు రచించిన ఖురాన్ గ్రంధ కాపీ, 800 వందల సంవత్సరాలనాటి పురాతన పైఠాని చీర వంటి అపురూప వస్తువులు ఇక్కడ చూడవచ్చు.
ఈ మ్యూజియం పర్యాటకులకు మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం 10.30 గం.లనుండి మ.1.30గం మరియు మ.3 గం. నుండి సా.6 గంటల వరకు తెరచి ఉంటుంది. ప్రవేశ రుసుము రూ.5 మాత్రమే.