ఔరంగాబాద్ పర్యటనకు ఉత్తమ సమయం వాతావరణం ఎంతో ఆహ్లాదకర౦గా, అనుకూలంగా ఉండే అక్టోబర్, మార్చి మధ్య కాలం ఔరంగాబాద్ చేరడానికి ఉత్తమమైనది.
ఔరంగాబాద్ లో వాతావరణంఔరంగాబాద్ లో సాధారణంగా వేసవి ఎంతో వేడిగా, శీతాకాలం సగటు చల్లదనం కంటే ఎక్కువగా ఉండే చలితో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతంలో వీచే తూర్పు గాలుల ప్రభావం ఔరంగాబాద్ లోని వాతావరణం పై ఉంటుంది.వేసవి కాలం:37- 21 మధ్య వ్యాపించి ఉండే సగటు ఉష్ణోగ్రతలతో వేసవి కాలం మార్చి నుండి మే వరకు ఉంటుంది. కొన్ని సార్లు సగటు ఉష్ణోగ్రత యాభై డిగ్రీల సెల్సియస్ కు కూడా చేరుతుంది. వేసవి ఎండలు పర్యాటక వినోదాన్ని నాశనం చేసే అవకాశం ఉన్నందున, వెళ్ళక పోవడమే మంచిది.
వర్షాకాలం:జూలై లో మొదలై అక్టోబర్ వరకు ఉండే వర్షాకాలం దృశ్యాల సందర్శనకు అనువైనది. ఏడాది లోని ఈ సమయంలో పర్యాటకులు ఈ ప్రాంత సందర్శనకు ప్రణాళిక వేసుకోవచ్చు.
శీతాకాలంసాధారణంగా పది డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రతలతో ఔరంగాబాద్ లో శీతాకాలం నవంబర్, ఫిబ్రవరి మధ్య ఉంటుంది. పురావస్తు స్థలాలు, పవిత్ర దేవాలయాల సందర్శనకు శీతాకాలం చక్కగా ఉంటుంది.