వాయుమార్గం బారాముల్లా కి 66 కి.మీ. దూరం లో గల శ్రీనగర్ ఎయిర్ బేస్ బారాముల్లకి అతి దగ్గరి విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని "షైక్ ఉల్ ఆలం" విమానాశ్రయమ ని కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయం భారత దేశ ముఖ్య నగరాలతో అనుసంధానించబడి ఉంది. వాటిలో ఢిల్లీ,చండీఘర్,ముంబై,షింలా వంటివి మచ్చుకు కొన్ని. శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకొన్న సందర్శకులు బస్సు లేదా ట్యాక్సీ ల ద్వారా బారాముల్లా చేరుకోవచ్చు.