Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెర్హంపూర్ » వాతావరణం

బెర్హంపూర్ వాతావరణం

బెర్హంపూర్ వాతావరణం బెర్హంపూర్ సందర్శనకు శీతాకాలం సరైన సమయం. ఉష్ణోగ్రతలు చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. శీతాకాలంలో మంచు తక్కువగా ఉండి, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బెర్హంపూర్ లోని దాదాపు అన్ని దేవాలయాలలో నిర్వహించే దసరా పండుగ (అక్టోబర్, నవంబర్ మధ్య జరుపుకుంటారు) సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.

వేసవి

వేసవి బెర్హంపూర్ లో వేసవి మార్చ్, జూన్ మధ్య వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువ తేమతో ఎక్కువ అసౌకర్యం ఉంటుంది. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, 45 డిగ్రీల మధ్య ఉంటుంది. వేసవిలో ఈ ఆలయాన్ని, రేవు పట్టణాన్ని సందర్శించడం సరైన ఆలోచన కాదు.

వర్షాకాలం

వర్షాకాలం భారతదేశంలో వర్షాకాలం అందమైన సీజన్. వేసవిలోని భరించలేని వేడి, పొడి వాతావరణం తరువాత, వర్షాల రాకతో ఉపశమనంగా ఉంటుంది. వర్షాకాలంలో బెర్హంపూర్ సందర్శన సరైన ఆలోచన కాదు. తుఫానులు, కుండపోత వర్షాలతో రోడ్లపై నీరు నిలిచి ప్రయాణానికి అసౌకర్యంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం తక్కువ వర్షాలు పడే అవకాశం, చల్లని ఉష్ణోగ్రతతో శీతాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ శీతాకాలం నవంబర్ ప్రారంభం నుండి ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత రాత్రులు 10 డిగ్రీల చల్లదనంతో, అత్యధికంగా 20 డిగ్రీలతో ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండి, దేశం వెలుపల, లోపల నుండి అనేకమంది పర్యాటకులను ఆహ్వానిస్తు౦ది.