Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » వాతావరణం

భరత్పూర్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: పర్యాటకులు వర్షాకాలంలో, శీతాకాలంలో ఈ అద్భుతమైన ప్రదేశానికి శేలవులలో విహార యాత్రగా రావచ్చు. కేవల్ దేవ్ నేషనల్ పార్క్ లో అనేక వలస పక్షులను చూడవచ్చు, ఇది పక్షులను చూడడానికి సరైన సమయం.

వేసవి

వాతావరణం వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): భరత్పూర్ లో వేసవి మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో సగటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 45.2 డిగ్రీలు,37 డిగ్రీలుగా నమోదవుతాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): భరత్పూర్ లో వర్షాకాలం జులై లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలంలో ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి తేమ స్థాయి 70 శాతం నమోదై ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు): భరత్పూర్ లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 31.7 డిగ్రీలు, 5 డిగ్రీలుగా నమోదవుతుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.