సందర్శించేందుకు ఉత్తమ సమయం : భీమ్టాల్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం ఎండాకాలం. హైకింగ్, ట్రెక్కింగ్ మరియు సైట్ సీయింగ్ ల కి ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. శీతాకాలం మొదలవ్వడానికి ముందు సమయం కూడా ఈ ప్రాంత సందర్శనకు అనువుగా ఉంటుంది.
ఎండాకాలం (మార్చ్ టు మే) : మార్చ్ నెలలో ప్రారంభమయ్యే ఎండాకాలం మే వరకు కొనసాగుతుంది. ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. ఎండాకాలం లో పర్యాటకులు తేలికపాటి కాటన్ మరియు ఉన్ని వస్త్రాలను తెచ్చుకోవాలి. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆహ్లాదకరమైన సమయం ఇది.
వర్షాకాలం(జూలై టు సెప్టెంబర్) : జూలై లో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. అందమైన పచ్చటి ప్రకృతి దృశ్యాలతో వర్షాకాలం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. భారీ వర్షపాతాలవల్ల ఈ సమయం లో భీమ్టాల్ కి ప్రయాణం కొంచెం కష్టతరం.
శీతాకాలం (నవంబర్ టు ఫిబ్రవరి) : నవంబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కాగా ఇక్కడ నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత -3 డిగ్రీల సెల్సియస్.