బితూర్ సందర్శనకు ఉత్తమ సమయం ఉత్తర భారతదేశంలోని ఇతర పట్టణాలు, నగరాల వలె బితూర్ లో కూడా నాలుగు విభిన్న కాలాలు ఉన్నాయి: వేసవి, శీతాకాలం, వసంత, శరదృతువు. వాతావరణం ఆహ్లాదకరంగా, తేలికగా ఉండే నవంబర్, ఏప్రిల్ మధ్య కాలం సందర్శనకు ఉత్తమమైనది. మిగిలిన నెలలలో ఇక్కడ చాల వేడిగా, పొడిగా ఉంటుంది. బితూర్ ప్రాధాన్యత పొందిన తీర్థయాత్రా పట్టణమైనందున ఏడాది పొడవునా సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంటుంది.